Salaar : జపాన్ రిలీజ్‌కి సిద్దమవుతున్న సలార్.. కానీ విడుదలకు అంత సమయమా..

జపాన్ రిలీజ్‌కి సిద్దమవుతున్న సలార్ కానీ విడుదలకు మాత్రమే చాలా సమయం తీసుకుంటుంది. అక్కడ రిలీజ్ ఎప్పుడో తెలుసా..?

Prabhas Salaar Part 1 Ceasefire is getting ready to release Japan and latin america

Salaar : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో రెండు భాగాలుగా రూపొందించిన చిత్రం ‘సలార్’. డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పార్ట్ 1 సీజ్ ఫైర్ భారీ విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి రికార్డు కలెక్షన్స్ ని నమోదు చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ఇంకా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద తన జోరుని చూపిస్తుంది.

కాగా ఈ మూవీ ఇప్పుడు జపాన్ రిలీజ్ కి సిద్దమవుతుంది. బాహుబలి సినిమాలతో ప్రభాస్ కి జపాన్ లో ఓ రేంజ్ క్రేజ్ ఏర్పడింది. దీంతో ప్రభాస్ ప్రతి కొత్త సినిమా అక్కడ రిలీజ్ అవుతూ వస్తుంది. రీసెంట్ గా సలార్ కూడా రిలీజ్ అయ్యింది. అయితే అది తెలుగు లాంగ్వేజ్‌తో జపాన్ సబ్ టైటిల్స్ తో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు జపాన్ లాంగ్వేజ్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికరంగా ప్రకటించారు.

Also read : Samyuktha – Kavya Thapar : వరుస హిట్స్‌తో సంయుక్త.. ఆఫర్స్‌తో కావ్య తాపర్..

అయితే రిలీజ్ కి మాత్రం చాలా సమయం తీసుకుంటున్నారు. ఈ ఏడాది సమ్మర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అంటే దాదాపు ఐదు నెలలు తరువాత ఈ చిత్రం జపాన్ లో రిలీజ్ కాబోతుంది. అలాగే సలార్ స్పానిష్ వెర్షన్ ని కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఆ చిత్రాన్ని మార్చి 7న విడుదల చేయబోతున్నారు. ఈ రిలీజ్‌లతో సలార్ కలెక్షన్స్ కౌంట్ మరింత పెరిగే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఈ మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే.. వరల్డ్ వైడ్‌గా ఇప్పటివరకు రూ.660 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకున్నట్లు తేలుస్తుంది. కాగా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 345 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. అంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే.. 347 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్, సుమారు 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టాలి. ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ బట్టి చూస్తే.. ఈ చిత్రం సుమారు 20 కోట్ల షేర్ ని అంటే 40 కోట్ల గ్రాస్ ని అందుకోవాల్సి ఉంది.