Samyuktha – Kavya Thapar : వరుస హిట్స్‌తో సంయుక్త.. ఆఫర్స్‌తో కావ్య తాపర్..
అందాల భామల సంయుక్త మీనన్, కావ్య తాపర్.. తెలుగులో క్రేజీ హీరోయిన్స్ గా మారుతున్నారు. ఒకరు వరుస సక్సెస్ లు అందుకుంటూ లక్కీ హీరోయిన్ అనిపించుకుంటే, మరొకరు వరుస ఆఫర్స్ అందుకుంటూ తెలుగులో బిజీ అవుతున్నారు.

Samyuktha Menon Kavya Thapar movie hits and new offers
Samyuktha – Kavya Thapar : అందాల భామల సంయుక్త మీనన్, కావ్య తాపర్.. తెలుగులో క్రేజీ హీరోయిన్స్ గా మారుతున్నారు. ఒకరు వరుస సక్సెస్ లు అందుకుంటూ లక్కీ హీరోయిన్ అనిపించుకుంటే, మరొకరు వరుస ఆఫర్స్ అందుకుంటూ తెలుగులో బిజీ అవుతున్నారు.
సంయుక్త మీనన్..
మలయాళ సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ కేరళ భామ.. పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేసిన సంయుక్త మంచి విజయానే అందుకున్నారు. ఆ తరువాత కళ్యాణ్ రామ్ సరసన ‘బింబిసారా’లో నటించి సెకండ్ హిట్ ని అందుకున్నారు.
మూడో చిత్రంగా బై లింగువల్ మూవీ ధనుష్ ‘సార్’లో నటించి కెరీర్ బిగ్గెస్ట్ హిట్టుని అందుకున్నారు. ఆ తరువాత సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’లో నటించి.. తన యాక్టింగ్ తో ప్రతి ఒక్కర్ని ఆశ్చర్యపరిచారు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇక రీసెంట్ గా కళ్యాణ్ రామ్ సరసన మరోసారి నటించిన చిత్రం ‘డెవిల్’. ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయ్యింది. అయితే హిట్స్ తో పాటు ఆఫర్స్ వస్తున్నా.. సంయుక్త జాగ్రత్తగా స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు.
View this post on Instagram
కావ్య తాపర్..
ముంబై భామ కావ్య తాపర్ ‘ఈ మాయ పేరేమిటో’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత ‘ఏక్ మినీ కథ’ సినిమాతో యూత్ ని ఆకట్టుకున్నారు. తమిళ డబ్బింగ్ చిత్రం ‘బిచ్చగాడు 2’తో కూడా ఇక్కడ ఆడియన్స్ ని పలకరించి మంచి విజయానే అందుకున్నారు. ఇప్పుడు మూడు తెలుగు సినిమాలతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు.
రవితేజ ‘ఈగల్’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ ఫిబ్రవరి 9న విడుదల కాబోతుంది. ఈ చిత్రంతో పాటు గోపీచంద్-శ్రీనువైట్ల ‘విశ్వం’, రామ్-పూరీజగన్నాధ్ ‘డబుల్ ఇస్మార్ట్’, సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు కూడా చర్చల్లో ఉన్నట్లు తేలుస్తుంది. ఈ ఏడాది కావ్య తాపర్ పేరు గట్టిగానే వినిపించనుంది.
View this post on Instagram