Prabhas sister in law video gone viral in salaar celebrations
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ తన అభిమానుల కోసం వరుస సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఆ ఫ్యాన్స్ కోరే మరో కోరికను మాత్రం పక్కన పెట్టేస్తున్నారు. ప్రభాస్ ని పెళ్లి కొడుకుగా చూడాలని అభిమానులంతా కోరుకుంటున్నారు. అది ఎప్పుడు జరుగుతుందా అని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి అనే మాటే ఎత్తడం లేదు. అయితే ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య శ్యామల దేవి.. 2024లో ప్రభాస్ పెళ్లి కచ్చితంగా జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉంటే, ఇప్పుడు సలార్ రిలీజ్‌కి ముందు ప్రభాస్ మరదలు వైరల్ అవుతున్నారు.
ప్రభాస్ కి చుట్టం అయిన ఒక అమ్మాయిని ఇటీవల ఓ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో విలేకరి ఆమెను ప్రశ్నిస్తూ.. “మీరు ప్రభాస్ గారి మరదలే కదా. ప్రభాస్ బర్త్ డేకి విషెస్ చెబుతూ ‘బావ’ అంటూ పోస్టు కూడా పెట్టారు” అని అడిగారు. దానికి ఆమె బదులిస్తూ.. “నేను కేవలం నా ఫోన్ లో స్టేటస్ మాత్రమే పెట్టుకున్నాను. అంతేగాని ఆయనికి డైరెక్ట్ గా మెసేజ్ చేసే సీన్ లేదు” అని చెప్పుకొచ్చారు. అలాగే ప్రభాస్ తనకి బావ అవుతారని కూడా ఆమె ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Also read : సలార్ ఫ్లెక్సీ కడుతూ.. కరెంట్ షాక్ తగిలి ప్రభాస్ అభిమాని మృతి..
ఇక ఇది చూసిన రెబల్ అభిమానులు.. “ప్రభాస్ అన్న మరదలు. మన వదినమ్మ” అంటూ ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు. మరి ప్రభాస్ ఈ ఏడాది అయినా పెళ్లి చేసుకుంటారేమో చూడాలి. అయితే ప్రభాస్ చేసుకోబోయే ఆ అమ్మాయి ఎవరు అన్న దానిపై అందరి ఆసక్తి నెలకొంది. అయితే ఫ్యాన్స్ అంతా అనుష్క, ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని అనుకుంటున్నారు. ఆన్ స్క్రీన్ పై, ఆఫ్ స్క్రీన్ పై చాలా క్లోజ్ గా ఉండే ఈ ఇద్దరి మిత్రులు.. భార్యాభర్తలుగా మారితే చూడాలని ఆశ పడుతున్నారు. మరి ప్రభాస్ ఎవరితో ఏడడుగులు వేస్తారో చూడాలి.