Prabhas Sisters : ట్రెడిషినల్ గా ప్రభాస్ ముగ్గురు చెల్లెల్లు.. తల్లితో కలిసి.. ఫోటోలు వైరల్..

తాజాగా ప్రభాస్ ముగ్గురు చెల్లెల్లు కలిసి దిగిన స్పెషల్ ఫోటోలను ప్రసీద షేర్ చేసారు.

Prabhas Sister Praseedha Uppalapati Shares Special Photos of Prabhas Sisters and Cousins

Prabhas Sisters : నటుడు కృష్ణంరాజుకు ముగ్గురు కూతుళ్లు అని తెలిసిందే. ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తి.. అని కృష్ణంరాజుకు ముగ్గురు కూతుళ్లున్నారు. ఈ ముగ్గురికి ప్రభాస్ అన్నయ్య అంటే చాలా ఇష్టం. ప్రభాస్ కూడా వీళ్ళను బాగా చూసుకుంటాడు. వీరిలో ప్రసీద ఉప్పలపాటి రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలు కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ప్రసీద తమ నిర్మాణ సంస్థ బాధ్యతలను చూసుకుంటుంది. మిగిలిన ఇద్దరూ మాత్రం సోషల్ మీడియాకు దూరంగానే ఉంటారు.

Also Read : Udaya Bhanu Daughters : థ్యాంక్యూ బాలయ్య మామ.. ఉదయభాను పిల్లలు ఎంత క్యూట్ గా చెప్పారో.. బ్రాహ్మణి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడంతో..

తాజాగా ప్రభాస్ ముగ్గురు చెల్లెల్లు కలిసి దిగిన స్పెషల్ ఫోటోలను ప్రసీద షేర్ చేసారు. ట్రెడిషినల్ గా ముగ్గురు చెల్లెల్లు చీరలో రెడీ అయి ఫోటోలు దిగారు. అలాగే వాళ్ళ అమ్మ, కృష్ణంరాజు భార్య శ్యామల దేవితో కూడా కలిసి ఫోటో దిగారు. ఓ పెళ్లి లేదా ఏదైనా ఈవెంట్లో వీరు ఫోటోలు దిగినట్టు తెలుస్తుంది. అలాగే ప్రభాస్ చెల్లెల్లు వాళ్ళ ఫ్యామిలీ కజిన్స్ తో కూడా ఫోటోలు దిగారు. ప్రసీద ఈ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Also Read : Sundeep Kishan : ఆ సినిమా నుంచి సందీప్ కిషన్ హీరోగా తప్పుకున్నాడా? తీసేసారా? సందీప్ ప్లేస్ లో హీరో ఎవరంటే..?

దీంతో ప్రభాస్ చెల్లెల్లు ట్రెడిషినల్ గా ముగ్గురు కలిసి కనిపించడంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. పలువురు ప్రభాస్ ఫ్యాన్స్ ఫొటోలో ప్రభాస్ మిస్సింగ్, మా ప్రభాస్ అన్నకు కూడా పెళ్లి చేసేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ప్రభాస్ చెల్లి ప్రసీద షేర్ చేసిన ఫోటోలను చూసేయండి..