Udaya Bhanu Daughters : థ్యాంక్యూ బాలయ్య మామ.. ఉదయభాను పిల్లలు ఎంత క్యూట్ గా చెప్పారో.. బ్రాహ్మణి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడంతో..
తాజాగా ఆ కార్యక్రమంలో జరిగిన ఓ సంఘటన, నారా బ్రాహ్మణి పంపిన గిఫ్ట్ గురుంచి చెప్తూ తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది ఉదయభాను.

Photo Credits : Udaya bhanu Youtube
Udaya Bhanu Daughters : ఒకప్పటి స్టార్ యాంకర్ ఉదయభాను పెళ్లి, పిల్లలు సమయంలో కాస్త కెరీర్ కి బ్రేక్ ఇచ్చింది. మళ్ళీ గత కొన్నాళ్ల నుంచి పలు టీవీ షోలు, సోషల్ మీడియా, యూట్యూబ్ లో బిజీగా ఉంది. ఈమెకు ఇద్దరు కవల పిల్లలు భూమి, యువి ఉన్నారు. అయితే ఉదయభాను బాలకృష్ణకు వీరాభిమాని. అంతేకాకుండా బాలయ్య కూడా చెల్లి అని దగ్గరకు తీసుకుంటారు. ఉదయభాను ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా బాలయ్య వెళ్తారు. బాలయ్య ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఉదయభానుని పిలుస్తారు. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది.
తాజాగా బాలయ్య కూతురు నారా బ్రాహ్మణి ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ని ఉదయభాను పిల్లల కోసం పంపించింది. ఇటీవల బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా నారా భువనేశ్వరి ఓ ప్రైవేట్ పార్టీ అరేంజ్ చేసిన సంగతి తెలిసిందే. కేవలం నారా, నందమూరి ఫ్యామిలీలు, పలువురు బాలయ్య సన్నిహితులు అయిన సినీ ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉదయభాను హోస్ట్ చేసింది. తాజాగా ఆ కార్యక్రమంలో జరిగిన ఓ సంఘటన, నారా బ్రాహ్మణి పంపిన గిఫ్ట్ గురుంచి చెప్తూ తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది ఉదయభాను.
Also Read : Sundeep Kishan : ఆ సినిమా నుంచి సందీప్ కిషన్ హీరోగా తప్పుకున్నాడా? తీసేసారా? సందీప్ ప్లేస్ లో హీరో ఎవరంటే..?
ఈ వీడియోలో ఉదయభాను మాట్లాడుతూ.. మా పిల్లలు బాలయ్య మామ అని పిలుస్తారు. బాలయ్య గారు చాలా ఇష్టం వాళ్లకు. బాలయ్య బాబు గారి బిడ్డ నారా బ్రాహ్మణి నుంచి బ్యూటిఫుల్ సర్ ప్రైజ్ గిఫ్ట్ వయోలిన్ వచ్చింది. ఇటీవల బాలయ్య గారికి పద్మ భూషణ్ అవార్డు వచ్చినందుకు నారా భువనేశ్వరి గారు ఏర్పాటు చేసిన పార్టీకి నేను యాంకరింగ్ చేశాను. మా పిల్లలు, భర్త కూడా ఆ ఈవెంట్ కు వచ్చారు. నా పిల్లలు అక్కడ బ్రాహ్మణిని కలిశారు. చాలా బాగా మాట్లాడారు. బ్రాహ్మణి నా పిల్లలతో మాట్లాడుతూ వాళ్ళ గురించి అడగడంతో నా బిడ్డ వయోలిన్ నేర్చుకోవాలి, నాకు ఇష్టం అని చెప్పింది. దాంతో బ్రాహ్మణి నా దగ్గర వయోలిన్ ఉంది. నేను వాడట్లేదు. నీకు గిఫ్ట్ గా పంపిస్తాను నువ్వు నేర్చుకో అని చెప్పింది. నెక్స్ట్ డేనే బాలయ్య మేనేజర్ నుంచి కాల్ వచ్చింది. ఆయన కాల్ చేసి బ్రాహ్మణి గారు ఇలా గిఫ్ట్ పంపిస్తున్నారు అని అడ్రెస్ తీసుకొని ఇంటికి వయోలిన్ పంపించారు. బాలయ్య గారి లాగే ఆయన బిడ్డ కూడా చాలా మంచివారు అని తెలిపింది.
అలాగే ఆ వయోలిన్ ని తన పిల్లలకు ఓపెన్ చేసి చూపించడంతో పిల్లలు ఆశ్చర్యపోయారు. బాలయ్య మామ, బ్రాహ్మణి అక్క పంపించారు అని చెప్పింది ఉదయభాను. దీంతో పిల్లలు థ్యాంక్యూ బ్రాహ్మణి అక్క, థ్యాంక్యూ బాలయ్య మామ అని క్యూట్ గా ఆ వయోలిన్ పట్టుకొని చెప్పారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోతో మరోసారి బాలయ్య కానీ ఆయన కుటుంబం కానీ తన అనుకుంటే వాళ్ళను ఎంత బాగా చూసుకుంటారో తెలుస్తుంది. మీరు కూడా ఉదయభాను పోస్ట్ చేసిన వీడియో చూసేయండి..