Saif Ali Khan : కత్తితో దాడి.. సర్జరీ.. ఇంత జరిగిన తర్వాత కూడా సెక్యూరిటీ వద్దంటున్న సైఫ్ అలీ ఖాన్.. పైగా ఈ దాడి గురించి ఏమన్నాడో తెలుసా?
తాజాగా ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైఫ్ అలీ ఖాన్ తన భద్రత గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసాడు.

Saif Ali Khan Interesting Comments on his Attack Issue and Security
Saif Ali Khan : ఇటీవల బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ఓ వ్యక్తి దొంగతనానికి రావడం, సైఫ్ పట్టుకోవాలని చూడటంతో అతను కత్తితో సైఫ్ పై దాడి చేసి పారిపోవడం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సైఫ్ కు తీవ్ర గాయాలు అవ్వడంతో హాస్పిటల్ లో చేర్చి పలు సర్జరీలు చేసారు. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే ఈ దాడి ఘటనలో సైఫ్ అలీ ఖాన్ కి సెక్యూరిటీ ఎందుకు లేదు? బాడీ గార్డ్స్ ఎందుకు లేరు అని విమర్శలు వచ్చాయి.
దాడి అనంతరం మాత్రం పోలీసుల సూచనలతో సైఫ్ తన ఇంటి చుట్టూ భద్రత పెట్టించాడు. ఇంటి చుట్టూ సీసీ కెమెరాలతో పాటు ముంబైలోనే హై ప్రొఫైల్ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన రోనిత్ రాయ్ ఏస్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ నుంచి భద్రతను పెట్టించుకున్నాడు. అయితే తాజాగా ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైఫ్ అలీ ఖాన్ తన భద్రత గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసాడు. అలాగే ఇటీవల దాడి చేసిన వ్యక్తిపై కూడా ఆసక్తిగా మాట్లాడాడు.
Also Read : Parvati Nair Wedding : వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ఫోటోలు చూశారా..?
సైఫ్ అలీఖాన్ మాట్లాడుతూ.. నాకు సెక్యూరిటీ మీద నమ్మకం లేదు. ఈ దాడి తర్వాత అందరూ నాకు సెక్యూరిటీ లేదు అని అడుగుతున్నారు. నాకు ఎలాంటి భద్రత వద్దు. ఎప్పుడూ సెక్యూరిటీ సిబ్బందితో నేను ఉండాలని అనుకోవట్లేదు. ఈ దాడి ఒక పీడకల అని భావిస్తున్నాను. ఈ దాడి తర్వాత కూడా నేను సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోదలుచుకోవట్లేదు. నాకు ఎలాంటి ముప్పు వాటిల్లదు. ఈ దాడి పొరపాటుగా జరిగింది. దొంగతనానికి వచ్చిన వ్యక్తి దాడి చేసాడు కానీ నా మీద కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ దాడి జరగలేదు. ఈ దాడి నా జీవితాన్ని మార్చదు. అలా నేను మార్చాలనుకోవట్లేదు అని అన్నారు.
Also Read : Thandel : బాక్సాఫీస్ వద్ద ‘తండేల్’ కలెక్షన్ల వర్షం.. వడివడిగా 100 కోట్ల వైపు అడుగులు..
దీంతో సైఫ్ అలీ ఖాన్ వ్యాఖ్యలు వైరల్ గా మారిపోయాయి. తనపై దాడి చేసిన వ్యక్తి గురించి సాఫ్ట్ గా మాట్లాడటంతో ఆశ్చర్యపోతూ అభినందిస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం సెక్యూరిటీ పెట్టుకోవాలని కోరుతున్నారు. ఇక దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు. మరి సైఫ్ అలీ ఖాన్ అతనిపై దాడి చేసిన వ్యక్తి గురించి చేసిన వ్యాఖ్యలతో కేసు విషయంలో ఏమైనా మారుతుందా చూడాలి.