Prabhas Spirit movie director Sandeep Reddy Vanga new look
Sandeep Reddy Vanga : టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.. తన సినిమా మేకింగ్ తో ఆడియన్స్ లో హీరో స్థాయి ఇమేజ్ ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆడియన్స్ లో ఈయనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దీంతో సందీప్ ప్రతి విషయం పై అభిమానులు ఒక కన్ను వేసి ఉంచుతున్నారు. తాజాగా ఈ దర్శకుడు ఎవరికి తెలియకుండా.. తిరుమల శ్రీవారిని దర్శించుకొని వచ్చేదామని ప్లాన్ చేసారు.
కానీ సందీప్ లాంటి స్టార్ డైరెక్టర్ ని గుర్తు పట్టకుండా ఉంటారా. ఆయన దర్శనం చేసుకొని వస్తుండగా కెమెరాలతో చుట్టేశారు. సందీప్ గురించి, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి ప్రశ్నలు వేయడం స్టార్ట్ చేసారు. ఇక వాటికి సందీప్ వంగ బదులిస్తూ.. “ప్రతి ఏడాది తిరుమల వస్తాను. కానీ ఈమధ్య కొంచెం గ్యాప్ వచ్చింది. ఈరోజు ఇవాళ కుదిరింది. నెక్స్ట్ ప్రభాస్ గారితో స్పిరిటి చేస్తున్నాను. త్వరలోనే అది స్టార్ట్ కాబోతుంది” అంటూ చెప్పుకొచ్చారు.
Also read : Janhvi Kapoor : పుట్టినరోజు నాడు ప్రియుడితో కలిసి.. తిరుమల వెంకన్నని దర్శించుకున్న జాన్వీ..
#SandeepReddyVanga had darshan today at Tirumala
Next #Prabhas garu toh #Spirit start avthundhi pic.twitter.com/M7izkIFGtG
— Suresh PRO (@SureshPRO_) March 6, 2024
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఇది చూసిన నెటిజెన్స్.. సందీప్ వంగ కొత్త లుక్ అదిరింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే.. లలిత జ్యువలరీ యాడ్ గుండు అంకుల్ లా ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక స్పిరిట్ మూవీ విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ప్రభాస్ ఇప్పటివరకు పోలీస్ రోల్ చేయలేదు. దీంతో ఈ సినిమా పై ఆడియన్స్ లో భారీ అంచనాలే నెలకొన్నాయి. కాగా ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి-సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.