Prabhas takes Anushka MSMPrecipechallenge and forward to Ram Charan
Prabhas – Anushka : టాలీవుడ్ లో ఒక కొత్త ఛాలెంజ్ స్టార్ట్ అయ్యింది. అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) కలయికలో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా.. అనుష్క #MSMPrecipechallenge అంటూ ఛాలెంజ్ ని స్టార్ట్ చేసింది. ఈ ఛాలెంజ్ లో భాగంగా అనుష్క తన ఫేవరెట్ రెసిపీ షేర్ చేసి ప్రభాస్ ఫేవరెట్ రెసిపీ ఏంటో చెప్పమంది. అలాగే తనని కూడా ఈ ఛాలెంజ్ ని మరొకరికి ఇవ్వమని కోరింది.
ఇక అనుష్క ఛాలెంజ్ ని స్వీకరించిన ప్రభాస్ తన ఫేవరెట్ డిష్ ఏంటో తెలియజేశాడు. ‘రొయ్యల పలువా’ తన ఫేవరెట్ డిష్ అంటూ అందుకు సంబంధించిన రెసిపీని షేర్ చేశాడు. ఇక ఈ ఛాలెంజ్ ని తను రామ్ చరణ్ (Ram Charan) కి ఇస్తున్నట్లు ప్రకటించాడు. మరి రామ్ చరణ్.. ప్రభాస్ ఛాలెంజ్ స్వీకరిస్తాడా..? లేదా..? చూడాలి. ప్రస్తుతం ఈ ఛాలెంజ్ టాలీవుడ్ వైరల్ అవుతుంది. దీనివల్ల తమ ఫేవరెట్ స్టార్స్ ఫేవరెట్ డిష్ లు ఏంటో తెలుస్తున్నాయి. మరి ఈ ఛాలెంజ్ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.
ఇక ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా విషయానికి వస్తే.. సెప్టెంబర్ 7న తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతుంది. కొత్త దర్శకుడు పి.మహేష్ బాబు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అనుష్క చెఫ్ గా, నవీన్ స్టాండ్ అప్ కమెడియన్ గా కనిపించబోతున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మించారు.