Vijay Deverakonda : ఫ్యాన్స్‌నే కాదు డిస్ట్రిబ్యూటర్స్‌ని కూడా ఆదుకోండి.. విజయ్‌కి నిర్మాణ సంస్థ కౌంటర్ ట్వీట్..!

ఫ్యాన్స్‌నే కాదు డిస్ట్రిబ్యూటర్ల, ఎగ్జిబిటర్ల కుటుంబాలను కూడా ఆదుకోవాలంటూ విజయ్ దేవరకొండకు నిర్మాణ సంస్థ కౌంటర్ ట్వీట్.

Vijay Deverakonda : ఫ్యాన్స్‌నే కాదు డిస్ట్రిబ్యూటర్స్‌ని కూడా ఆదుకోండి.. విజయ్‌కి నిర్మాణ సంస్థ కౌంటర్ ట్వీట్..!

Abhishek Pictures producers counter to Vijay Deverakonda

Updated On : September 5, 2023 / 8:28 PM IST

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ దాదాపు ఐదేళ్ల తరువాత ఇప్పుడు ఖుషి (Kushi) సినిమాతో హిట్ అందుకున్నాడు. దీంతో రౌడీ హీరో ఫుల్ ఖుషీలో ఉన్నాడు. ఇక నిన్న సెప్టెంబర్ 4న వైజాగ్(Vizag) లో ఖుషి బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ జరగగా, ఆ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. అభిమానులకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఈ సినిమాని హిట్ చేసి తనకి ఖుషీ పంచిన అభిమానులకు.. ఆ ఖుషీని తిరిగి ఇస్తాను అని చెప్పి ప్రైజ్ మనీ అనౌన్స్ చేశాడు. ఒక 100 ఫ్యామిలీలను సెలెక్ట్ చేసి.. ప్రతి కుటుంబానికి ఒక లక్ష చొప్పున ప్రైజ్ మనీ అందిస్తాను అంటూ ప్రకటించాడు.

Sai Pallavi : ‘చంద్ర‌ముఖి 2’లో తొలుత సాయి ప‌ల్ల‌విని అనుకున్నారా..? మ‌రీ ఏం జ‌రిగింది..?

ఈక్రమంలోనే నేడు ఆ ప్రైజ్ మనీ కోసం అప్లై చేసుకోడానికి ఒక అప్లికేషన్ ని కూడా రిలీజ్ చేశాడు. అయితే ఈ ఆఫర్ పై ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ విజయ్ దేవరకొండకి కౌంటర్ ఇచ్చింది. 2020లో విజయ్ హీరోగా ఆడియన్స్ ముందుకు వచ్చిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఆ మూవీ హక్కులు కొన్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు బాగా నష్టపోయారు.

Vijay Deverakonda : విజయ్ ఇచ్చే లక్ష రూపాయలు పొందేందుకు.. ఇక్కడ అప్లై చేసుకోండి..

ఈ విషయాని గుర్తు చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ‘అభిషేక్ పిక్చర్స్’ ఒక ట్వీట్ చేసింది. “డియర్ దేవరకొండ, మీ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసి మేము 8 కోట్లు నష్టపోయాము. కానీ దాని మీద ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు మీ గొప్ప హృదయంతో కొన్ని కుటుంబాలకు మొత్తం మీద 1 కోటి డొనేట్ చేస్తున్నారు. అలాగే మీ సినిమాతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్ల, ఎగ్జిబిటర్ల కుటుంబాలను కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాము” అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుత ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.