Sai Pallavi : ‘చంద్ర‌ముఖి 2’లో తొలుత సాయి ప‌ల్ల‌విని అనుకున్నారా..? మ‌రీ ఏం జ‌రిగింది..?

లాఘ‌వ లారెన్స్‌(Raghava Lawrence) న‌టిస్తున్న చిత్రం చంద్రముఖి 2 (Chandramukhi 2). పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ న‌టి కంగ‌నా రనౌత్ (Kangana Ranaut) హీరోయిన్‌.

Sai Pallavi : ‘చంద్ర‌ముఖి 2’లో తొలుత సాయి ప‌ల్ల‌విని అనుకున్నారా..? మ‌రీ ఏం జ‌రిగింది..?

Sai Pallavi-Kangana

Updated On : September 5, 2023 / 7:49 PM IST

Sai Pallavi-Kangana : లాఘ‌వ లారెన్స్‌(Raghava Lawrence) న‌టిస్తున్న చిత్రం చంద్రముఖి 2 (Chandramukhi 2). పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ న‌టి కంగ‌నా రనౌత్ (Kangana Ranaut) హీరోయిన్‌. ఎంఎం కీర‌వాణి సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 19న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌గా సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసింది.

Vijay Deverakonda : విజయ్ ఇచ్చే లక్ష రూపాయలు పొందేందుకు.. ఇక్కడ అప్లై చేసుకోండి..

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. చంద్ర‌ముఖి 2 సినిమాలో కంగ‌నా రనౌత్ పోషిస్తున్న పాత్ర‌కు మొద‌ట సాయి ప‌ల్ల‌వి(Sai Pallavi)ని అనుకుంద‌ట చిత్ర బృందం. క‌ళ్ల‌తో చ‌క్క‌ని హావ‌భావాలు ప్ర‌ద‌ర్శించ‌డంతో పాటు డ్యాన్స్ సైతం ఎంతో అందంగా చేయ‌గ‌ల నేర్పు సాయి ప‌ల్ల‌వికి ఉండ‌డ‌మే అందుకు కార‌ణ‌మ‌ట‌. ఈ విష‌య‌మై చిత్ర బృందం సాయి ప‌ల్ల‌విని సంప్ర‌దించార‌ట‌. అయితే.. ఆమె ఈ ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించిన‌ట్లు స‌ద‌రు వార్త సారాంశం. ఒక‌వేళ సాయిప‌ల్ల‌వి గ‌నుక ఈ సినిమా చేసుంటే మ‌రింత ఆకర్ష‌ణ‌గా ఉండేదని ప‌లువురు అంటున్నారు.

భోళా శంక‌ర్‌లో సైతం..

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన సినిమా భోళా శంక‌ర్‌. మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో చిరు చెల్లెలి పాత్ర కోసం సాయిప‌ల్ల‌విని సంప్ర‌దించింది చిత్ర బృందం. అయితే.. ఇది రీమేక్ సినిమా కావ‌డంతో సున్నితంగా సాయిప‌ల్ల‌వి ఈ ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించారు. దీంతో ఆ అవ‌కాశం కీర్తి సురేశ్‌కు ద‌క్కింది. భోళా శంక‌ర్ సినిమా ఫ‌లితాన్ని కాస్త ప‌క్క‌న‌బెడితే చిరు-కీర్తి సురేశ్‌ల న‌ట‌న అంద‌రిని ఆక‌ట్టుకుంది.

Balagam Actor Died : విషాదం.. బ‌ల‌గం నటుడు కన్నుమూత