×
Ad

The Raja saab Twitter Review: ది రాజాసాబ్ ట్విట్టర్ రివ్యూ.. ప్రభాస్ కామెడీ యాంగిల్ ఎలా ఉందంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన 'ది రాజాసాబ్(The Raja saab Twitter Review)' మూవీ థియేటర్స్ కి వచ్చేసింది.

Prabhas The Raja Saab twitter Review

  • థియేటర్స్ కి వచ్చిన ప్రభాస్ ‘ది రాజాసాబ్’
  • చాలా చోట్ల ప్రీమియర్స్ పూర్తి
  • ప్రభాస్ కుమ్మేశాడు సోషల్ మీడియాలో రివ్యూలు చెప్తున్నా నెటిజన్స్

The Raja saab Twitter Review: ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’. కామెడీ చిత్రాల దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్దీ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఆ హైప్ ను రెట్టింపు చేయడంతో ఆడియన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఇక సంక్రాంతి కానుకగా ది రాజాసాబ్ సినిమా జనవరి 9 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లోకి వచ్చేసింది. ఆంద్రప్రదేశ్ పలు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. దుబాయ్ లో కూడా షోస్ ఇప్పటికే పూర్తయ్యాయి. దీంతో, ది రాజాసాబ్ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా(The Raja saab Twitter Review) వేదికగా తమ అభిప్రాయాలను చెబుతున్నారు.

Allu Arjun: కింగ్డమ్ డైరెక్టర్ తో అల్లు అర్జున్.. షూట్ కూడా స్టార్ట్ అయ్యింది

ది రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ రాజాసాబ్ క్యారక్టర్ నెక్స్ట్ లెవల్లో ఉందట. ఆయన యాక్టింగ్, కామెడీ టైమింగ్ చాలా బాగుందని చెప్తున్నారు. ముఖ్యంగా దెయ్యానికి ప్రభాస్ భయపడే సీన్స్ ఆడియన్స్ ని ఒక రేంజ్ లో నవ్విస్తాయట. ఆ విషయంలో ప్రభాస్ ను చాలా బాగా వాడుకున్నాడట దర్శకుడు మారుతీ. ఇక మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ కి కూడా మంచి టాక్ వస్తోంది.

సంజయ్ దత్ పాత్రకు సంబందించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, నానమ్మ ఎమోషన్ కూడా చాలా బాగా సెట్ అయ్యింది అంటున్నారు. ఇక తమన్ అందించిన మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళిందట. అయితే, కొంతమంది మాత్రం ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉందని, ఒక్క హై మూమెంట్ కూడా లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఓవరాల్ గా ది రాజాసాబ్ సినిమా పండక్కి ఫ్యామిలీతో చూసే సినిమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా గురించి ఫుల్ రివ్యూ రావాలీ అంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.