Rajasaab
Rajasaab : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మాణంలో డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ది రాజాసాబ్’. మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్.. హీరోయిన్స్ గా నటిస్తుండగా సంజయ్ దత్, బొమన్ ఇరానీ, జరీనా వాహబ్, ప్రభాస్ శ్రీను, సప్తగిరి, విటివి గణేష్, సత్య.. పలువురు కీలక పాత్రల్లో నటించారు.(Rajasaab)
రాజాసాబ్ సినిమా నేడు జనవరి 9న రిలీజ్ అయింది. మిక్స్‌డ్ టాక్ తో థియేటర్స్ లో నడుస్తుంది ఈ సినిమా. ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోయింది అంటున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలా ఉందని చెప్తున్నారు ప్రేక్షకులు. అయితే ఇటీవల ఏ సినిమా అయినా రిలీజ్ తోనే ఆ సినిమా ఏ ఓటీటీలోకి వచ్చేస్తుందో స్క్రీన్ మీద చెప్పేస్తున్నారు.
Also Read : The Raja Saab Review : ‘ది రాజాసాబ్’ మూవీ రివ్యూ.. హారర్ సినిమా అన్నారు.. కానీ..
రాజాసాబ్ సినిమా ఓటీటీ పార్ట్నర్ ని కూడా ప్రకటించారు. ఇలాంటి పెద్ద సినిమా అంటే ఏ నెట్ ఫ్లిక్స్ లోనో, ఏ అమెజాన్ ప్రైమ్ లోనో అనుకున్నారు కానీ జియో హాట్ స్టార్ ఓటీటీలోకి రాబోతున్నట్టు ప్రకటించారు. హాట్ స్టార్ ని జియో హస్తగతం చేసుకున్న తర్వాత ఇండియన్ లోకల్ సినిమాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమాను తీసుకున్నట్టు తెలుస్తుంది. రాజాసాబ్ సినిమా జియో హాట్ స్టార్ ఓటీటీలోకి రానుంది.
ఇటీవల ఎంత పెద్ద సినిమా అయినా 27 నుంచి 30 రోజుల్లో వచ్చేస్తుంది ఓటీటీలోకి. ఈ లెక్కన రాజాసాబ్ సినిమా ఫిబ్రవరి రెండో వారంలో అంటే వాలెంటైన్స్ వీక్ లో జియో హాట్ స్టార్ ఓటీటీలోకి రానున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు సంక్రాంతికి థియేటర్స్ లోకి వస్తే వాలెంటైన్స్ డే కి గిఫ్ట్ గా ఓటీటీలోకి రాజాసాబ్ రానున్నట్టు సమాచారం.
Also Read : Constable Kanakam Season 2 : ‘కానిస్టేబుల్ కనకం’ సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ.. చంద్రిక ఏమైంది..?