Prabhas Unstoppable Episode Releaseing in Theaters?
Unstoppable 2 : ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ రెండు తెలుగు స్టేట్స్‌లో భారీ హైప్‌ని క్రియేట్ చేసుకుంది. ఈ ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇక ఆహా టీమ్ అయితే వరుస పెట్టి ప్రోమోలను విడుదల చేస్తూ అంచనాలు మరెంత పెంచేస్తుంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రభాస్ గ్లింప్స్‌ని, గోపీచంద్ ప్రోమోని విడుదల చేయగా, సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
Pawan Kalyan : అన్‌స్టాపబుల్ షోకి పవన్ కళ్యాణ్.. వైరల్ అవుతున్న నాగవంశీ ట్వీట్!
కాగా ఈ ఎపిసోడ్ గురించి ఇప్పుడు ఒక న్యూస్ బయటకి వచ్చింది. అదేంటంటే ఈ స్పెషల్ ఎపిసోడ్ ఓటిటిలో కాదంటా విడుదలయ్యేది, థియేటర్‌లో విడుదల కాబోతుంది అంటా. ఇటీవల ఒక అభిమానిని ట్విట్టర్ వేదికగా ఆహా టీమ్‌ని.. ‘ప్రభాస్ ఎపిసోడ్ ని థియేటర్స్‌లో ప్రీమియర్స్ వేయోచ్చగా’ అంటూ అడిగిన ప్రశ్నకి ఆహా టీమ్ బదులిచ్చింది. “ఈ ఐడియా ఏదో బాగుంది. ఏమంటారు ఫ్యాన్స్?” అంటూ ట్వీట్ చేసింది.
ఇక ఈ ట్వీట్ చూసిన అభిమానులు థియేటర్‌లో రిలీజ్ చేయమంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆహా టీమ్ ఏ డెసిషన్ తీసుకుంటుందో చూడాలి. కాగా ఈ ఎపిసోడ్ ని న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 30 లేదా 31న విడుదల చేయనున్నారు. ఒకవేళ ఫ్యాన్స్ కోరిక మేరకు థియేటర్‌లో రిలీజ్ చేస్తే.. డార్లింగ్ అభిమానులకు న్యూ ఇయర్ నైట్ పండగనే చెప్పాలి.
This looks like a good idea!
Fans, emantaru??#UnstoppableWithNBKS2#PrabhasUnstoppbleGlimpse#Prabhas?#NandamuriBalakrishna https://t.co/oK4xHe2uXk— ahavideoin (@ahavideoIN) December 14, 2022