Site icon 10TV Telugu

Prabhas: 12 ఏళ్ల తరువాత మొగల్తూరుకు ప్రభాస్ రాక.. సందడి చేసిన అభిమానులు!

Prabhas Visits Mogalturu After 12 Years

Prabhas Visits Mogalturu After 12 Years

Prabhas: నటుడు కృష్ణంరాజు ఇటీవల మృతిచెందడంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లింది. ఇక గురువారం నాడు ఆయన సంస్మరణ కార్యక్రమాన్ని ఆయన స్వస్థలం మొగల్తూరులో నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా ప్రభాస్ దాదాపు పన్నేండేళ్ల తరువాత తన సొంత ఊరుకు వెళ్లడంతో ఆయన్ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకున్నారు.

Prabhas: “రాజు ఏ పరిస్థితిలో ఉన్నా రాజే”.. ప్రభాస్ ని పొగుడుతున్న నెటిజెన్లు!

ప్రభాస్ రాక గురించి తెలుసుకుని, చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా అభిమానులు భారీ ఎత్తున మొగల్తూరుకు చేరుకున్నారు. వారందరూ తనను చూసేందుకు వచ్చాడని తెలుసుకుని, ప్రభాస్ వారికి అభివాదం చేసి వారిని పలకరించాడు. ప్రభాస్ ను చూడగానే అభిమానులు సంతోషంతో కేకలు వేశారు. అయితే తమను చూసేందుకు వచ్చిన వారందరూ తప్పకుండా భోజనం చేసి వెళ్లాల్సిందిగా ప్రభాస్ కోరాడు.

Prabhas: కృష్ణంరాజు మరణంపై ప్రభాస్ సోషల్ మీడియా పోస్ట్.. ఎమోషనల్ గా ఉన్న వీడియో!

ఇక మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సందర్భంగా లక్షన్నర మందికి భోజనం ఏర్పాట్లు చేశాడు ప్రభాస్. ఈ క్రమంలో కృష్ణంరాజు భార్య, కుమార్తెలు కూడా అక్కడికి చేరుకుని సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

Exit mobile version