Boyapati Srinu: అఖండ 2 కోసం బోయపాటికి భారీ రెమ్యునరేషన్.. స్కందకి డబుల్ ఇస్తున్నారు..

నందమూరి బాలకృష్ణ-దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబో ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మాస్ కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చి బాక్సాఫీస్ ను ఊచకోత కోశాయి.

Boyapati Srinu: అఖండ 2 కోసం బోయపాటికి భారీ రెమ్యునరేషన్.. స్కందకి డబుల్ ఇస్తున్నారు..

Director Boyapati Srinu is taking a huge remuneration for Akhanda 2 movie

Updated On : November 24, 2025 / 9:05 AM IST

Boyapati Srinu: నందమూరి బాలకృష్ణ-దర్శకుడు బోయపాటి శ్రీను కాంబో ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మాస్ కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చి బాక్సాఫీస్ ను ఊచకోత కోశాయి. వాటిలో సింహా, లెజెండ్, అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. అందుకే, ఈ కాంబోలో సినిమా వస్తుంది అంటే ఆ హైప్ ఒక రేంజ్ లో ఉంటుంది. అయితే, నాలుగోసారి జతకట్టారు బాలకృష్ణ-బోయపాటి(Boyapati Srinu). అదే అఖండ 2. బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అఘోర పాత్రలో థియేటర్స్ లో పూనకాలు తెప్పించిన బాలకృష్ణ మరోసారి ఆ జాతరను పరిచయం చేయడానికి థియేటర్స్ కి వస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Brahmanandam: తప్పుగా అర్థం చేసుకున్నారు.. దయన్నను అవమానించలేదు.. వీడియో రిలీజ్ చేసిన బ్రహ్మానందం

అందుకే, ఈ సినిమా విడుదల కోసం నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు నార్మల్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, తాజాగా అఖండ 2 సినిమా గురించి ఒక న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే, ఈ సినిమా కోసం దర్శకుడు బోయపాటి శ్రీనుకి భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నారట. ఆయన గత చిత్రం స్కంద సినిమాకు ఆయన అక్షరాలా రూ.18 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకున్నారు. కానీ, మంచి హైప్ తో వచ్చిన స్కంద సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో, బోయపాటి రెమ్యునరేషన్ తగ్గుతుంది అనుకున్నారు అంతా.

కానీ, డబుల్ అయినట్టుగా ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అఖండ 2 సినిమా కోసం బోయపాటికి ఏకంగా రూ.36 కోట్ల రెమ్యునరేషన్ ముట్టజెపుతున్నారట మేకర్స్. ఈ న్యూస్ కాస్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే, హీరోకి గానీ, దర్శకుడికి గానీ ఒక సినిమా ప్లాప్ పడింది అంటే తరువాత సినిమా రెమ్యునరేషన్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది. కానీ, బోయపాటి మాత్రం దానికి రివర్స్ గా ఉన్నాడు. ముందుకన్నా ఆయన రెమ్యునరేషన్ ఇప్పుడు డబుల్ అయ్యింది. ఈ ఒక్క విషయం చాలు, బోయపాటిపై, ఆయన చేస్తున్న అక్కడ 2 సినిమాపై మేకర్స్ కి ఎంత నమ్మకం ఉంది అని. కాబట్టి, డిసెంబర్ 5న వస్తున్న అఖండ 2 బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. మినిమమ్ పాజిటీవ్ టాక్ వస్తే చాలు దేశవ్యాప్తంగా ఈ సినిమా రూ.500 కోట్లు కొల్లగొట్టడం చాలా ఈజీ. మరి సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా చూడాలి.