Brahmanandam: తప్పుగా అర్థం చేసుకున్నారు.. దయన్నను అవమానించలేదు.. వీడియో రిలీజ్ చేసిన బ్రహ్మానందం

ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం(Brahmanandam)పై నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. రీసెంట్ గా అయన మోహన్ బాబు 50 ఏళ్ళ సినీ ప్రస్థానం సందర్భంగా జరిగిన ఈవెంట్ కి హాజరయ్యారు.

Brahmanandam: తప్పుగా అర్థం చేసుకున్నారు.. దయన్నను  అవమానించలేదు.. వీడియో రిలీజ్ చేసిన బ్రహ్మానందం

Brahmanandam releases video on Errabelli Dayakar controversy

Updated On : November 24, 2025 / 7:28 AM IST

Brahmanandam: ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందంపై నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. రీసెంట్ గా అయన మోహన్ బాబు 50 ఏళ్ళ సినీ ప్రస్థానం సందర్భంగా జరిగిన ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ పట్ల అమర్యాదగా ప్రవర్తించాడని, ఆయన్ని అవమానించాడని ఫ్యాన్స్ మండిపడుతూ పోస్టులు పెట్టారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. తాజాగా ఈ వివాదంపై క్లారిటీ ఇస్తూ వీడియో విడుదల చేశాడు బ్రహ్మానందం(Brahmanandam).

Spirit: “స్పిరిట్” ఓపెనింగ్ కి ప్రభాస్ ఎందుకు రాలేదు.. కారణం అదేనా.. ఫ్యాన్స్ ఏమంటున్నారో తెలుసా..

ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ..”నాది, దయాకర్ రావు గారిది 30 ఏళ్ల స్నేహం. ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా కలుసుకుంటూ ఉంటాం. నాకు ఆయనకు ఎంతో చనువు ఉంది. మొన్న ఈవెంట్ లో ఆయన ఫోటో తీసుకుందాం అన్నాడు. ఆలస్యం అయిపోతుందని ఫొటో వద్దు అన్నట్టుగా వెళ్లిపోయాను. అంతే అక్కడ జరిగింది. అందులో ఎలాంటి దురుద్దేశం లేదు. దానిని, కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ వీడియో వీడియో వైరల్ అవడం చూసి నవ్వుకున్నాను. దయన్నకు కాల్ చేసి కూడా కాసేపు నవ్వుకున్నాం. ఆ వీడియోపై క్లారిటీ ఇవ్వాలని, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దని ఈ వీడియో చేస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు బ్రహ్మానందం.