Keerthy Suresh: అదొక్కటే కంట్రోల్ చేసుకోలేకపోతున్నా.. నాతో నాకే యుద్ధం.. కీర్తి సురేష్ కామెంట్స్ వైరల్
స్టార్ బ్యూటీ కీర్తి సురేష్(Keerthy Suresh) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆమెకు, ఆమె చేసే సినిమాలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కెరీర్ మొదట్లో కాస్త పద్దతిగా కనిపించిన ఈ బ్యూటీ ఈ మధ్య గ్లామర్ రోల్స్ కి కూడా సై అంటోంది.
Keerthy Suresh says it's very difficult to follow a strict diet
Keerthy Suresh: స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆమెకు, ఆమె చేసే సినిమాలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కెరీర్ మొదట్లో కాస్త పద్దతిగా కనిపించిన ఈ బ్యూటీ ఈ మధ్య గ్లామర్ రోల్స్ కి కూడా సై అంటోంది. బాలీవుడ్ లో ఈ అమ్మడు బాబీ జాన్ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో తన గ్లామర్ హద్దులను చెరిపేసింది ఈ బ్యూటీ. అంతేకాదు, ఎలాంటి రోల్ చేయడానికైనా సిద్దమే అనే సంకేతాన్ని ఇవ్వకనే ఇచ్చింది. అయితే, కీర్తి సురేష్(Keerthy Suresh) కి ఫుడ్ అంటే చాలా ఇష్టం. ప్రతీ ఐటెంను చాలా ప్రేమగా, ఆస్వాదిస్తూ తింటారట. ఇదే విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకొచ్చారు.
Dhanush: హిందీలో ధనుష్ కొత్త మూవీ.. తెలుగులో భలే టైటిల్ పెట్టారు.. మరి ఆలాగే ఉంటుందా..
అందుకే, సినిమాలోకి వచ్చిన మొదట్లో చాలా లావుగా, బొద్దుగా కనిపించారు. ఈ మధ్య కాస్త సన్నబడ్డారు. కానీ, కీర్తి సురేష్ కి చాలా కష్టమైనా పని అంటే డైట్ చేయడమేనట. అది చేయడం ఎంత కష్టమో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఈ బ్యూటీ. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..”ఫుడ్‌పై నాకున్న ఇష్టాన్ని నియంత్రించుకోవడం చాలా కష్టంగా ఉంది. ఆ విషయంలో నాతో నేనే ఫైట్ చేస్తూ ఉంటాను. ఫిజిక్ మెయింటైన్ చేయడం కోసం కఠినమైన డైట్‌ను ఫాలో అవడం అనేది నాకు పెద్ద చాలెంజ్. నావల్ల కావడం లేదు”అంటూ చెప్పుకొచ్చింది కీర్తి సురేష్. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో ఒకే ఒక సినిమా చేస్తోంది. అదే రౌడీ జనార్ధన. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో మొదటిసారి విజయ్ దేవరకొండతో నటిస్తోంది కీర్తి సురేష్. ఈ సినిమాకి సంబందించిన రెగ్యులర్ షూటింగ్ కూడా ఈ మధ్యే మొదలయ్యింది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
