Dhanush: హిందీలో ధనుష్ కొత్త మూవీ.. తెలుగులో భలే టైటిల్ పెట్టారు.. మరి ఆలాగే ఉంటుందా..

తమిళ స్టార్ ధనుష్(Dhanush) కి భాషతో సంబందంలేదు. ఆయన ఎక్కడ కావాలనుకుంటే అక్కడ సినిమా చేసేస్తాడు. ఇప్పటికే తమిళ, తెలుగు. హిందీ భాషల్లో సినిమాలు చేసాడు.

Dhanush: హిందీలో ధనుష్ కొత్త మూవీ.. తెలుగులో భలే టైటిల్ పెట్టారు.. మరి ఆలాగే ఉంటుందా..

Dhanush Hindi movie Tere Ishq Mein is also releasing in Telugu.

Updated On : November 24, 2025 / 9:33 AM IST

Dhanush: తమిళ స్టార్ ధనుష్ కి భాషతో సంబందంలేదు. ఆయన ఎక్కడ కావాలనుకుంటే అక్కడ సినిమా చేసేస్తాడు. ఇప్పటికే తమిళ, తెలుగు. హిందీ భాషల్లో సినిమాలు చేసాడు. ఆయన హిందీలో చేసిన “రంజనా” సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్యూర్ లవ్ అండ్ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది కానీ, తెలుగులో మాత్రం విడుదల కాలేదు. తాజాగా ధనుష్(Dhanush) మరో హిందీ మూవీలో నటిస్తున్నాడు. అదే “తేరే ఇష్క్ మే”. ఈ సినిమాను కూడా దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కిస్తుండగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. లవ్ అండ్ ఎమోషనల్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Boyapati Srinu: అఖండ 2 కోసం బోయపాటికి భారీ రెమ్యునరేషన్.. స్కందకి డబుల్ ఇస్తున్నారు..

పాన్ ఇండియా లెవల్లో విడుదల కానున్న ఈ సినిమా తెలుగులో కూడా అలరించనుంది. కాబట్టి, ఈ సినిమాకు తెలుగులో టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు అమరకావ్యం అనే వినూత్నమైన టైటిల్ ను ఫిక్స్ చేశారు. దీంతో, టైటిల్ భలేగా ఉంది సినిమా కూడా అంతే ఎమోషనల్ గా ఉంటుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఏ భాషలో వచ్చిన సినిమాలకు అదే భాషలో ఉండే ఉండేలా టైటిల్ ఫిక్స్ చేస్తున్నారు. ఈ విషయంలో చాలా మంది ఆడియన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నాయి. కానీ, ఈ సినిమా విషయంలో మాత్రం అచ్ఛ తెలుగు టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ధనుష్ సినిమాల విషయానికి వస్తే, ఇటీవలే ఇడ్లీ కొట్టు అనే సినిమాను విడుదల చేశాడు ధనుష్. ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించడం విశేషం. ఇక ఈ సినిమా తరువాత ప్రస్తుతం ధనుష్ సంగీత దిగ్గజం ఇళయరాజా బయోపిక్ లో నటిస్తున్నాడు. కెప్టెన్ మిల్లర్ సినిమా దర్శకుడు అరుణ్ మాతేశ్వరం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.