Prabhas : హైదరాబాద్ అమ్మాయితో ప్రభాస్ పెళ్లి అంటూ ప్రచారం.. అసలు విషయం చెప్పిన హీరో టీమ్

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ అయిన ప్ర‌భాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త వైర‌ల్ అవుతోంది.

Prabhas wedding rumours his team gives clarity

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని ఆయ‌న అభిమానుల‌తో పాటు సినీ ప్రియులంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ అయిన ప్ర‌భాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త వైర‌ల్ అవుతోంది.

హైద‌రాబాద్‌కు చెందిన ఓ అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడ‌ని, ఆమె ఓ వ్యాపార‌వేత్త కూతురు అని ఆంగ్ల మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. ఈ పెళ్లి ప‌నుల‌ను ప్ర‌భాస్ పెద్ద‌మ్మ శ్యామ‌లా దేవి స్వ‌యంగా ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నార‌ని స‌దరు వార్త‌ల సారాంశం.

Mad Square : ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ రివ్యూ.. పడీ పడీ నవ్వాల్సిందే..

అయితే.. దీనిపై ప్ర‌భాస్ టీమ్ తాజాగా స్పందించింది. ఆ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేదంది. ఎవ్వ‌రూ కూడా ఇలాంటి పుకార్ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరింది. ప్ర‌స్తుతానికి ప్ర‌భాస్‌కు అలాంటి ఆలోచ‌న లేద‌ని, ఏదైన ఉంటే అధికారికంగా ఆ స‌మాచారాన్ని తామే స్వ‌యంగా ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపింది.

స‌లార్‌, క‌ల్కి మూవీ భారీ విజ‌యాల‌ను అందుకోవ‌డంతో ప్ర‌భాస్ ప్ర‌స్తుతం పుల్ జోష్‌లో ఉన్నారు. వ‌రుస చిత్రాల్లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ‘ది రాజాసాబ్’, ‘ఫౌజీ’ చిత్రాలతో న‌టిస్తున్నారు. ఇక ఏడాది చివరిలో ‘స్పిరిట్’ మూవీ చిత్రీక‌ర‌ణ ప్రారంభం కానున్న‌ట్లుగా తెలుస్తోంది.