Prabhas Will do Bhakta Tukaram Biopic Rumors goes Viral
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అరడజను సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో సినిమా ఓకే చేసాడని తెలుస్తుంది. చారిత్రాత్మక మూవీలో నటించేందుకు రెడీ అవుతున్నాడనే గాసిప్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. మరాఠా డైరెక్టర్ దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతుంది. ఇది ఒక బయోపిక్ అని కూడా సమాచారం.
ప్రభాస్ భక్త తుకారాం పాత్రలో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా భక్త తుకారాం జీవితం ఆధారంగా, ఆధ్యాత్మికత, భక్తి రసంతో కూడిన ఒక భారీ చిత్రంగా తెరకెక్కనుందని సమాచారం. ప్రభాస్ ఈ పాత్ర కోసం ఇప్పటికే స్క్రిప్ట్ విన్నాడని, కథపై ఆసక్తి చూపినట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను కన్నడ చిత్ర పరిశ్రమలో పేరొందిన ఒక ప్రముఖ నిర్మాత నిర్మించనున్నట్లు వినిపిస్తుంది.
Also Read : Dil Raju : అలాంటి వాళ్ళను సినీ పరిశ్రమ నుంచి బహిష్కరిస్తాం.. దిల్ రాజు సంచలన నిర్ణయం..
ప్రభాస్ నటించబోతున్నారంటున్న చారిత్రాత్మక మూవీని మరాఠీ, తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తారని అంటున్నారు. అందుకే లేటెస్ట్ టెక్నాలజీతో భారీ సెట్స్‌లో చిత్రీకరణ జరిగే అవకాశం ఉందని టాక్. ప్రభాస్ లాంటి స్టార్ హీరో చారిత్రాత్మక మూవీ తీస్తే బిగ్ హిట్ అవడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా కోసం ప్రభాస్ తన లుక్‌ను పూర్తిగా మార్చుకునే అవకాశం ఉందని, భక్త తుకారాం పాత్రకు తగ్గట్టుగా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించనున్నాడని గాసిప్స్ హల్‌చల్ చేస్తున్నాయి.
అయితే భక్త తుకారాం బయోపిక్ ని గతంలో ఏఎన్నార్ తీశారు. భక్త తుకారాం పేరుతోనే ఈ సినిమా వచ్చింది. భక్తిరస చిత్రంగా ప్రేక్షకులను మెప్పించింది ఈ సినిమా. మహారాష్ట్రకు చెందిన శ్రీకృష్ణ భక్తుడు భక్త తుకారాం. మరి ఆయన జీవిత చరిత్రలో నిజంగానే ప్రభాస్ నటిస్తున్నాడా అంటే అధికారిక ప్రకటన వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే.