Dil Raju : అలాంటి వాళ్ళను సినీ పరిశ్రమ నుంచి బహిష్కరిస్తాం.. దిల్ రాజు సంచలన నిర్ణయం..

ఈ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ..

Dil Raju : అలాంటి వాళ్ళను సినీ పరిశ్రమ నుంచి బహిష్కరిస్తాం.. దిల్ రాజు సంచలన నిర్ణయం..

Dil Raju Sensational Comments in CM revanth Public Awareness Meeting

Updated On : June 26, 2025 / 6:41 PM IST

Dil Raju : నేడు హైదరాబాద్ లో మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని ఈ వేదిక నుంచి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ FDC చైర్మన్ గా దిల్ రాజు కూడా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ.. ఇటీవల మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఇండస్ట్రీలో ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే వారిని ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తామని నిర్ణయం తీసుకున్నారు. అలాగే తెలంగాణ FDC నుంచి చెప్తున్నా అలాంటిది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా జరిగితే వాళ్ళని నిర్ములిస్తే జనాల్లోకి మంచి మెసేజ్ వెళ్తుంది. FDC చైర్మన్ గా తెలుగు సినీ పరిశ్రమతో మాట్లాడి అది ఇక్కడ కూడా అమలయ్యేలా చూస్తాము అని అన్నారు.

Also Read : CM Revanth – Charan – Vijay : ఒకే వేదికపై.. సీఎం రేవంత్ తో రామ్ చరణ్, విజయ్ దేవరకొండ.. ఫొటోలు..

గతంలో తెలుగు సినీ పరిశ్రమ, పరిశ్రమ వ్యక్తులు అనేకమార్లు డ్రగ్స్ కి సంబంధించిన వార్తల్లో నిలిచారు. మరి దిల్ రాజు చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకొని నిజంగా అమలు చేస్తే మంచిదే.

Also Read : Kannappa : ‘కన్నప్ప’ సీక్వెల్ పై విష్ణు కామెంట్స్.. ప్రీక్వెల్ అయితే తీయొచ్చు అంటూ..