Prabhudheva : ప్రభుదేవా కొరియోగ్రాఫర్‌గా, డైరెక్టర్‌గా, నిర్మాతగా, నటుడిగా పేరు తెచ్చుకున్నారు. తమిళ, హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో పనిచేసారు. ఎందరో టాప్ స్టార్ల పాటలకు డాన్స్ కొరియోగ్రాఫ్ చేసిన ప్రభుదేవా రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి డాన్స్ గురించి ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టు ఆసక్తికరంగా మారింది.
Double Ismart : ఇస్మార్ట్ శంకర్ తిరిగి వస్తున్నాడు.. ఎప్పుడో తెలుసా?
ప్రభుదేవా డాన్స్‌లో చేయని ప్రయోగాలు లేవనిపిస్తుంది. తండ్రి సుందరం మాస్టర్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ప్రభుదేవా ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా పేరు తెచ్చుకున్నారు. ‘జెంటిల్ మెన్’ సినిమాలో ‘చికుబుకు చికుబుకు రైలే’ అంటూ ప్రభుదేవా స్టెప్పులు వేస్తే యూత్ ఊగిపోయారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ప్రభుదేవా కొరియోగ్రాఫ్ చేసిన పాటలు ఓ రేంజ్లో సూపర్ హిట్ అయ్యాయి. చిరు డాన్స్‌కి ఎంతో క్రేజ్ తెచ్చిపెట్టాయో ప్రభుదేవాకి అంత గుర్తింపు తెచ్చిపెట్టాయి.
చిరంజీవికి ప్రభుదేవా కొరియోగ్రాఫ్ చేసిన అన్ని పాటలు దాదాపుగా హిట్ అయ్యాయి. రాజా విక్రమార్క సినిమాలోని గగన కిరణ గమనమిది, గ్యాంగ్ లీడర్ సినిమాలోని చికు చికు చైలం, రౌడీ అల్లుడు సినిమాలోని అమలాపురం బుల్లోడా, ఘరానా మొగుడు సినిమాలోని బంగారు కోడిపెట్ట, ముఠా మేస్త్రీ సినిమాలోని ఈ పేటకు నేనే మేస్త్రి వంటి పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ప్రత్యేకంగా నిలిచిపోయాయి.
Gopika : గోపిక ఏంటి ఇంతలా మారిపోయింది.. గుర్తు పట్టలేనంతగా
కాగా తాజాగా ప్రభుదేవా మెగాస్టార్ చిరంజీవి డాన్స్‌ని ఉద్దేశించి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. ప్రభుదేవా వెనుక టీవీలో ‘ఇంద్ర’ సినిమాలో వీణ పాట ‘దాయి దాయి దామ్మా’ స్టెప్పులు వేస్తున్న వీడియో ప్లే అవుతోంది. మెగా మెగా మెగాస్టార్ డాన్స్ చూడటం.. వర్కవుట్ చేయడం ప్రేరణ కలిగిస్తుంది అంటూ పోస్టు పెట్టారు. నిజంగా తన డాన్స్ లతో ట్రెండ్ మార్చింది మెగాస్టారే.. అందుకు పరోక్షంగా ప్రభుదేవా వంటి కొరియోగ్రాఫర్ల టాలెంట్ కూడా. చిరంజీవి సినిమాకు ప్రభుదేవా మళ్లీ డాన్స్ ఎప్పుడు కంపోజ్ చేస్తారో? వీరిద్దరి కాంబోలో వచ్చే డాన్స్ మేజిక్ చూడాలని జనాలు ఎప్పుడూ ఎదురుచూస్తునే ఉంటారు.
Watching Mega Mega Mega Star’s Dance & Working Out #Inspiration @KChiruTweets pic.twitter.com/GRUnfqEbL8
— Prabhudheva (@PDdancing) February 16, 2024