Prabhutva Sarai Dukanam
Prabhutva Sarai Dukanam : SVS ప్రొడక్షన్స్, శ్రీనిధి సినిమాస్ బ్యానర్స్ పై నేషనల్ అవార్డు గ్రహీత నరసింహా నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రభుత్వ సారాయి దుకాణం. దైవ నరేష్ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్ నిర్మాతలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సదన్ హాసన్, విక్రమ్ జిత్, నరేష్ రాజు, వినయ్ బాబు, శ్రీలు దాసరి, అదితి మైకేల్, మోహన సిద్ధిలు మెయిన్ లీడ్స్ లో నటిస్తున్నారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్, బాలు నాయక్, రంగరాజు, తిలక్, బలగం సహదేవ్, స్వప్న, జ్యోతి.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి టీజర్ రిలీజ్ చేశారు.(Prabhutva Sarai Dukanam)
ఒక పల్లెటూరులో జరిగే రాజకీయాలు, అక్రమ సంబంధాలు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. టీజర్ అయితే బోల్డ్ గా ఉంది. మీరు కూడా ప్రభుత్వ సారాయి దుకాణం టీజర్ చూసేయండి..
Also Read : Garikipati Narasimha Rao : ఆ ఫ్లాప్ సినిమాని చూడమంటున్న గరికపాటి.. నిజమైన ప్రేమ తెలియాలంటే..
ప్రభుత్వ సారాయి దుకాణం టీజర్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ నరసింహ నంది మాట్లాడుతూ.. ఈ కథను రెండు భాగాలుగా అనుకుని మొదట ఈ సినిమా మొదలుపెట్టాను. మనుషుల వ్యక్తిత్వాలు, మనిషి ఆలోచనలు అన్ని ఈ సినిమాలో పాత్రల్లో ప్రతిబింబిస్తుంటాయి. అందుకే జంతువు లక్షణాలు కలిగిన మనుషుల కథ అనే ట్యాగ్ పెట్టాను అని అన్నారు.
నిర్మాత దైవ నరేష్ గౌడ మాట్లాడుతూ.. ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా అద్భుతంగా ఉంటుంది. మా బ్యానర్లో మరొక 3 సినిమాలు రాబోతున్నాయి. కొంతమంది రాజకీయ నాయకులకు వెన్నులో వణుకు పుట్టించే సినిమాగా ఇది నిలిచిపోతుంది అన్నారు. నిర్మాత పరిగి స్రవంతి మల్లిక్ మాట్లాడుతూ.. ఒక దర్శకుడికి సినిమానే అన్ని. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు నరసింహ నంది ఎంతో శ్రద్ధతో ప్రభుత్వ సారాయి దుకాణం సినిమాని తీశారు. ఈ సినిమాలో ప్రతి పాత్ర హీరోనే. ఒక గ్రామంలో జరిగే కొన్ని వాస్తవ సంఘటనలను తీసుకొని స్త్రీ శక్తి చూపిస్తూ తీసిన సినిమా. ఎంతో ధైర్యం ఉంటే కానీ ఇటువంటి సినిమా తీయలేరు. అంతటి ధైర్యం ఉన్న వ్యక్తి మా దర్శకుడు అని తెలిపారు.
Also See : Anasuya Bharadwaj : నెదర్లాండ్స్ లో ఫ్రెండ్స్ తో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న అనసూయ..