Garikipati Narasimha Rao : ఆ ఫ్లాప్ సినిమాని చూడమంటున్న గరికపాటి.. నిజమైన ప్రేమ తెలియాలంటే..

తాజాగా చేసిన ఓ ప్రవచనంలో గరికపాటి నరసింహ రావు ఓ సినిమాని చూడమని సూచించారు. (Garikipati Narasimha Rao)

Garikipati Narasimha Rao : ఆ ఫ్లాప్ సినిమాని చూడమంటున్న గరికపాటి.. నిజమైన ప్రేమ తెలియాలంటే..

Garikipati Narasimha Rao

Updated On : September 16, 2025 / 7:43 PM IST

Garikipati Narasimha Rao : ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహ రావు తన ప్రవచనాలతో అప్పుడప్పుడు వైరల్ అవుతారని తెలిసిందే. తన ప్రవచనల్లో సినిమాల గురించి కూడా అప్పుడపుడు మాట్లాడుతుంటారు. తాజాగా చేసిన ఓ ప్రవచనంలో గరికపాటి ఓ సినిమాని చూడమని సూచించారు.

గరికపాటి నరసింహ రావు మాట్లాడుతూ.. 8 వసంతాలు సినిమా చూడండి. ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది. నేను ఆ సినిమా చూసాను. మీరు కూడా చూడండి. ప్రేమ అంటే శారీరిక సౌఖ్యాలు, ఒకర్ని మించి ఒకరు గొప్పలు చెప్పుకోడాలు కాదు. నిజమైన ప్రేమ మనసులో ఉంటుంది. నిజంగా ప్రేమికుడు, ప్రేమికురాలైతే కలిసి ఉన్నా విడిపోయినా వాళ్ళు సుఖంగా ఉండాలని కోరుకుంటారు. కావాలంటే దేవదాసు సినిమా కూడా చూడండి అని అన్నారు. గరికపాటి చెప్పిన మాటలను 8 వసంతాలు నిర్మాణ సంస్థ తమ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Also Read : NTR : అమెరికాలో ఎన్టీఆర్ – నీల్ సినిమా..? అమెరికా కాన్సులేట్ హైదరాబాద్ పోస్ట్ వైరల్..

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మాణంలో ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన 8 వసంతాలు అనే సినిమా జూన్ 20న థియేటర్స్ లో రిలీజయింది. అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్ లో హను రెడ్డి, రవితేజ కీలక పాత్రల్లో ఈ సినిమాని తెరకెక్కించారు. రొటీన్ లవ్ స్టోరీలను ఒక అమ్మాయి కోణంలోంచి చూపిస్తూ కేవలం డైలాగ్స్, విజువల్స్ తో మాత్రమే ఈ సినిమాని నడిపించారు. దీంతో థియేటర్స్ లో ఈ సినిమా నిరాశపరిచింది.

దానికి తోడు సినిమా యూనిట్ ముందే ఓటీటీలో చూడండి ఇంకా బాగుంటుంది అని చెప్పడం, దర్శకుడు తన కామెంట్స్ తో వైరల్ అవ్వడంతో ఈ సినిమాని థియేటర్స్ లో పట్టించుకోలేదు. తర్వాత ఓటీటీలో వచ్చాక ప్రేమ కథలు, లవ్ షార్ట్ ఫిలిమ్స్ నచ్చే వాళ్లకు నచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

Also Read : Sandy Master : OG సినిమాలో ఆ సాంగ్ కొరియోగ్రఫీ చేసిన కిష్కింధపురి విలన్.. సినిమా అయితే మాస్ అంటూ..