Prabuthwa Junior Kalashala : ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ టీజర్ చూశారా.. రియల్ లైఫ్ ప్రేమ కథతో..
ఓ యదార్థ సంఘటనను తీసుకొని ఒక అందమైన ప్రేమ కథగా డైరెక్టర్ శ్రీనాథ్ ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్న సినిమా 'ప్రభుత్వ జూనియర్ కళాశాల'. టీజర్ లోని మ్యూజిక్, ఫ్రేమింగ్..

Prabuthwa Junior Kalashala Movie Official Teaser released by trivikram
Prabuthwa Junior Kalashala : యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సినిమాలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపుతున్నారు ఈ తరం దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే ఓ యదార్థ సంఘటనను తీసుకొని ఎంతో ఆసక్తికరంగా మలిచారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. ఆ సినిమాకి ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ టైటిల్ ఫిక్స్ చేసి యువత నచ్చేలా ఆ వాస్తవ కథకు తెరరూపమిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు సిద్దమైన క్రమంలో ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టారు మేకర్స్.
ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ సినిమాలో ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల ముఖ్యపాత్రల్లో నటించారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా దసరా శుభాకంక్షలతో ప్రభుత్వ జూనియర్ కళాశాల మూవీ టీజర్ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు విడుదల చెయ్యడం జరిగింది. ఈ క్రమంలో మేకర్స్ మాట్లాడుతూ ఆయన టీజర్ చూసి చాలా బాగుందన్నారు. ముఖ్యంగా మ్యూజిక్ అండ్ సినిమా ఫ్రేమింగ్ చాలా బాగుందన్నారు. కొత్త వారితో చేసినా యాక్టింగ్ మెచూరిటీగా సహజంగా ఉందన్నారు.
Also read : Bhagavanth Kesari : పవన్ కళ్యాణ్‌కి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ ప్రత్యేక షో.. ఎందుకో తెలుసా..?
అంతేకాకుండా టీనేజ్ లవ్ స్టోరీ లో ఉండాల్సిన ఇన్నోసెన్సీ ఇందులో కన్పిస్తుందన్నారు. ఈ సినిమా కచ్చితంగా యువతకి నచ్చుతుందని టీం అందరికి బెస్ట్ విషెస్ తెలియజేసి సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలియజేసారు అని వెల్లడించారు. ఇక ఈ సినిమా ఆడియో హక్కులను ఫాన్సీ రేటుకు టీ సిరీస్ తెలుగు సంస్థ దక్కించుకుంది. బ్లాక్ ఆంట్ పిక్చర్స్ అన్ని హంగులు జోడించి రూపొందించిన ఈ సినిమాకు శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాతగా వ్యవహరించారు. కార్తీక్ రోడ్రీగుజ్ స్వరాలను అందించగా కమ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించారు. శ్రీ సాయి కిరణ్ గారు లిరిక్స్ అందించారు. నిఖిల్ సురేంద్రన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఎడిటింగ్ కోదాటి పవన్ కళ్యాణ్ కాగా వంశి ఉదయగిరి కో- డైరెక్టర్‌గా పని చేశారు.