Pradeep Ranganathan: సూపర్ ఛాన్స్ కొట్టేసిన లవ్ టుడే డైరెక్టర్.. ఏకంగా ఆ స్టార్ హీరోతోనే..?

ఇటీవల కోలీవుడ్‌లో చాలా చిన్న సినిమాగా రిలీజ్ అయిన ‘లవ్ టుడే’ తమిళ బాక్సాఫీస్‌ను షేక్ చేసి అదిరిపోయే సక్సెస్‌ను అందుకుంది. ఈ సినిమా కమర్షియల్‌గా కూడా సాలిడ్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా సక్సెస్‌తో ఈ చిత్ర హీరో, డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. తమిళంలోనే కాకుండా ఈ సినిమాకు తెలుగులోనూ సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో ఇక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్ మూవీగా నిలిచింది.

Pradeep Ranganathan Gets Offer To Direct Rajinikanth

Pradeep Ranganathan: ఇటీవల కోలీవుడ్‌లో చాలా చిన్న సినిమాగా రిలీజ్ అయిన ‘లవ్ టుడే’ తమిళ బాక్సాఫీస్‌ను షేక్ చేసి అదిరిపోయే సక్సెస్‌ను అందుకుంది. ఈ సినిమా కమర్షియల్‌గా కూడా సాలిడ్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా సక్సెస్‌తో ఈ చిత్ర హీరో, డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. తమిళంలోనే కాకుండా ఈ సినిమాకు తెలుగులోనూ సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో ఇక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్ మూవీగా నిలిచింది.

Love Today: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసిన ‘లవ్ టుడే’.. ట్విస్టు మాత్రం మామూలుగా లేదుగా!

అయితే ప్రదీప్ రంగనాథన్ తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తాడా.. ఎలాంటి సినిమాను చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ యంగ్ డైరెక్టర్‌కు ఓ సెన్సేషనల్ ఆఫర్ దక్కినట్లుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ లవ్ టుడే సినిమాను చూశాడని.. ఆ సందర్భంగా ప్రదీప్ రంగనాథన్‌ను ఆయన ఇంటికి పిలిచి మరీ అభినందించారు. ఇక ఓ మంచి స్టోరీని రెడీ చేస్తే తనతో సినిమా చేసేందుకు రజినీ రెడీ అని చెప్పారట.

ఇలా రజినీకాంత్ స్వయంగా తనకు ఆఫర్ ఇవ్వడంతో ప్రదీప్ రంగనాథన్ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడట. మరి రజినీ కోసం ఈ యంగ్ డైరెక్టర్ ఎలాంటి కథను రెడీ చేస్తాడో చూడాలి. కాగా ప్రస్తుతం రజినీకాంత్ నెల్సన్ దిలీప్ డైరెక్షన్‌లో ‘జైలర్’ మూవీలో నటిస్తున్నారు. మరి నిజంగానే ప్రదీప్ రంగనాథన్ – రజినీ కాంబో సెట్ అవుతుందా లేదా అనేది చూడాలి.