Pradeep Ranganathan
Pradeep Ranganathan : తమిళ యువ హీరో ప్రదీప్ రంగనాథన్ తాను పవన్ కళ్యాణ్ అభిమాని అని అనేకమార్లు చెప్పుకొచ్చాడు. పలు ఇంటర్వ్యూలలో, ప్రెస్ మీట్స్ లో కూడా పవన్ పై తనకున్న అభిమానం గురించి చెప్పాడు. ఇటీవల పవన్ కళ్యాణ్ OG సినిమా యుఫోరియాని చూడటానికి చెన్నై నుంచి హైదరాబాద్ కి వచ్చి ఇక్కడ సింగిల్ స్క్రీన్ థియేటర్ లో సినిమా చూసి ఎంజాయ్ చేసాడు. ఆ విషయాన్ని తను సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.(Pradeep Ranganathan)
అయితే ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సినిమా రిలీజ్ కి ఉంది, అందుకే పవన్ పేరు వాడుకొని ఇలా ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు అని పలువురు నెటిజన్లు, వేరే హీరోల ఫ్యాన్స్ విమర్శలు చేసారు. తాజాగా డ్యూడ్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రదీప్ రంగనాథన్ ఈ విమర్శలకు కౌంటర్ ఇవ్వడమే కాక తనకు పవన్ పై ఉన్న అభిమానం గురించి చెప్పుకొచ్చాడు.
Also See : Kajal Aggarwal : భర్త గౌతమ్ కిచ్లుతో కాజల్ అగర్వాల్ కర్వా చౌత్ సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్..
ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ.. ఆ మాటలు నేను విన్నాను. నేను పవన్ కళ్యాణ్ సర్ కి కాలేజీ డేస్ నుంచి ఫ్యాన్. ఆయన క్రేజ్ ఎలాంటిదో నాకు తెలుసు. నేను మైత్రి వాళ్ళతో ఈ సినిమా చేస్తున్నప్పుడు మూవీ టీమ్ అనిల్ ఓ రోజు సరదాగా మాట్లాడుతూ మీ ఫేవరేట్ హీరో ఎవరు అంటే పవన్ కళ్యాణ్ సర్ అని చెప్పాను. నేను LIK సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ సర్ ఫ్యాన్ అన్నారు OG సినిమా చూశారా అని అడిగారు. నేను చూస్తాను షూటింగ్ బిజీలో ఉన్నాను అంటే ఇక్కడ చూస్తారా? పవన్ సర్ క్రేజ్ తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ థియేటర్స్ లో చూడండి, మీకు ఆ వైబ్ ఉంటుంది అని చెప్తే సరే అన్నాను.
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా OG వీడియోలు, సెలబ్రేషన్స్, వైబ్ కనిపించింది. దాంతో ఫ్యాన్ గా నాకు కూడా అలాగే సినిమా చూడాలి అని అనిల్ గారికి ఫోన్ చేసి హైదరాబాద్ వస్తున్నాను OG చూడటానికి అని చెప్పాను. ఆ రోజు షూటింగ్ అవ్వగానే సాయంత్రం హైదరాబాద్ వచ్చి ఇక్కడ థియేటర్లో OG సినిమా చూసాను. ఆ వైబ్, ఫ్యాన్స్ తో సినిమా చూడటం వేరే లెవల్ అని ప్రమోషన్స్ కోసం కాదని, సినిమా వైబ్ కోసం వచ్చినట్టు చెప్పి విమర్శలకు కౌంటర్ ఇచ్చాడు.
Also See : Nara Lokesh Balakrishna : జనసేన ఎమ్మెల్యే కొడుకు పెళ్లి.. సందడి చేసిన బాలయ్య, లోకేష్..
అలాగే పవన్ సినిమాల గురించి మాట్లాడుతూ.. నాకు తమ్ముడు, బద్రి సినిమాలు అంటే చాలా ఇష్టం. తమ్ముడు లాంటి సినిమా చేయాలని ఉంది. అందులో కామెడీ, మాస్, లవ్, ఎమోషన్.. అన్ని ఉంటాయి. బద్రి సినిమాలో బద్రినాథ్ అని చెప్పే డైలాగ్, ఆయన మేనరిజమ్స్ చాలా బాగుంటాయి అని చెప్పుకొచ్చాడు. గతంలో కూడా చాలా మంది తమిళ హీరోలు పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో తెలిపారు. ఇప్పుడు తమిళ యువ హీరోలు కూడా పవన్ కళ్యాణ్ గురించి ఈ రేంజ్ లో చెప్తుండటంతో పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.