బాలయ్యకు హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే!..

  • Publish Date - October 16, 2020 / 06:02 PM IST

Pragaya Martin: నటసింహ నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కనున్న హ్యాట్రిక్ ఫిల్మ్.. BB3(వర్కింగ్ టైటిల్)..ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. బాలయ్య పుట్టినరోజుకి రిలీజ్ చేసిన #BB3 First Roar వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

కాగా బాలయ్య రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు, విలన్ ఎవరు అనే విషయంలో రకరకాల వార్తలు వచ్చాయి. ఇటీవల రియల్ హీరో సోనూ సూద్ మెయిన్ విలన్‌గా ఫిక్స్ అయ్యారని తెలిసింది. తాజాగా బాలయ్యతో ఆడిపాడే హీరోయిన్ ఫిక్స్ అయిపోయింది.


మలయాళీ ముద్దుగుమ్మ Pragaya Martin (ప్రగ్యా మార్టిన్) ఈ సినిమాలో బాలయ్య పక్కన కథానాయికగా ఫిక్స్ అయింది. క్లాసికల్ డ్యాన్సర్, మోడల్‌ అయిన ప్రగ్యా మలయాళంలో చైల్డ్ ఆర్టిస్టుగానూ నటించింది. తమిళనాట ‘పిశాచి’ చిత్రంతో కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది. దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ నటించిన Ustad Hotel మూవీలో Cameo appearance ఇచ్చింది.

పలు మలయాళ సినిమాల్లో నటించి పాపులర్ అయిన ప్రగ్యా మార్టిన్‌ను, బాలయ్యకు జోడీగా ఫిక్స్ చేశారు. ఇదే ఈమె టాలీవుడ్ ఎంట్రీ. నవంబర్‌లో షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి మాటలు : ఎం.రత్నం, సంగీతం : తమన్, కెమెరా : సి.రామ్ ప్రసాద్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు, నిర్మాత : మిర్యాల రవీందర్ రెడ్డి.