Pragya Jaiswal: ప్రగ్యా నాజూకు అందాల వెనక ఇంత కష్టం దాగుందా?
నటీ నటులంటే అందంగా ఉండాలి.. ఏ మాత్రం కాస్త అటూ ఇటైనా ఇక అంతే సంగతులు. అందుకే కొందరు ఒళ్ళు గుల్ల చేసుకొని వర్క్ ఔట్స్ చేసి కష్టపడుతుంటే మరికొందరు మాత్రం కాస్మొటిక్స్ ట్రీట్మెంట్స్..
- Naresh Mannam
- Published On : November 21, 2021 / 09:27 PM IST
Pragya Jaiswal (2)
Pragya Jaiswal: నటీ నటులంటే అందంగా ఉండాలి.. ఏ మాత్రం కాస్త అటూ ఇటైనా ఇక అంతే సంగతులు. అందుకే కొందరు ఒళ్ళు గుల్ల చేసుకొని వర్క్ ఔట్స్ చేసి కష్టపడుతుంటే మరికొందరు మాత్రం కాస్మొటిక్స్ ట్రీట్మెంట్స్ తో కవర్ చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో దాదాపుగా హీరో, హీరోయిన్లందరూ వర్క్ ఔట్స్ తోనే ఫిజిక్ మైంటైన్ చేస్తున్నారు. ఇందులో ఆడ, మెగా అనే తేడా లేకుండా అందమైన ముద్దుగుమ్మలు కూడా తీవ్రంగా కష్టపడుతున్నారు.
Anubhavinchu Raja: రాజ్ తరుణ్ ఖాతాలో డజను ప్లాపులు.. గట్టెక్కుతాడా?
ఒకవైపు యోగా.. మరోవైపు జిమ్.. వీటితో పాటు అవసరమైతే కడుపు కాల్చుకొని డైటింగ్ కూడా. ప్రగ్యా జైస్వాల్ అనగానే గుర్తొచ్చేది అందాల బొమ్మనే. అందానికి అందం.. చార్మింగ్.. ఫిజిక్, పర్సనాలిటీ ఎందులో అయినా ప్రగ్యాను పొగడాల్సిందే. అయితే.. ఈ అందం వెనుక.. పర్సనాలిటీని ఇలా కాపాడుకోవడం వెనుక ఎంత కష్టం దాగి ఉందో స్వయంగా ప్రగ్యానే ఇన్ స్టాలో ఓ వీడియో షేర్ చేసింది.
Virata Parvam: ఓటీటీ డీల్ క్యాన్సిల్.. ప్లాన్ ఎందుకు మారింది?
స్పోర్ట్స్ వేర్ లో ప్రగ్యా జైశ్వాల్ ఫ్లిప్స్, కేటిల్ బెల్ స్క్వాట్స్, పుష్ అప్స్, బాటిల్ రోప్ వర్కవుట్స్ తో పలు ఫిట్ నెస్ టిప్స్ ను ప్రయత్నిస్తూ తన అందమైన దేహం వెనుకున్న శ్రమ ఇదేనని చెప్పకనే చెప్పింది. ఇక, ప్రగ్యా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణతో కలిసి అఖండలో నటించగా హిందీలో సల్మాన్ ఖాన్, ఆయుష శర్మ కాంబోలో వస్తున్న అంథిమ్.. ది ఫైనల్ ట్రుత్‌లో ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.
