Virata Parvam: ఓటీటీ డీల్ క్యాన్సిల్.. ప్లాన్ ఎందుకు మారింది?

కరోనా మహమ్మారి దెబ్బకి చాలా సినిమాలు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వగైరా వగైరా అన్ని పనులు పూర్తయినా విడుదల విషయంలో మాత్రం సందిగ్ధంలో ఉంటూ వచ్చాయి.

Virata Parvam: ఓటీటీ డీల్ క్యాన్సిల్.. ప్లాన్ ఎందుకు మారింది?

Virata Parvam

Virata Parvam: కరోనా మహమ్మారి దెబ్బకి చాలా సినిమాలు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వగైరా వగైరా అన్ని పనులు పూర్తయినా విడుదల విషయంలో మాత్రం సందిగ్ధంలో ఉంటూ వచ్చాయి. అయితే, కరోనా నుండి బయటపడి మెల్లగా ఒక్కో సినిమా ఒక్కో మార్గంలో బయటకి వచ్చేశాయి. కొందరు కరోనా సమయంలో అలవాటైన ఓటీటీకి ఓటేస్తే మరికొందరు ధైర్యంగా అడుగుముందుకేసి థియేటర్లలోనే విడుదల చేశారు. మొత్తంగా ఇన్నాళ్లు వివిధ స్థాయిలో ఉన్న సినిమాలన్నీ ఇప్పుడు ఒక్కటిగా ముందుకొచ్చేస్తున్నాయి.

Mahesh-Rajamouli: క్రేజీ కాంబో కోసం విక్రమ్ డేట్స్.. ఇందులో నిజమెంత?

అయితే.. దగ్గుబాటి రానా-సాయి పల్లవిల విరాట పర్వం సినిమా మాత్రం నిన్నటి వరకు ఎందుకు ఎక్కడ ఏ పరిస్థితిలో ఆగిందో కూడా బయటకి రాకుండా ఉంటూ వచ్చింది. దగ్గుబాటి ఫ్యామిలీ నుండి వచ్చే సినిమాలన్నీ వరసగా ఓటీటీలోనే విడుదల అవుతుండడంతో రానా విరాట పర్వం ఓటీటీలోనే విడుదల అవుతుందని ప్రచారం జరిగింది. ఈ మేరకు ఓ ఓటీటీతో డీల్ కూడా కుదిరిందని సురేష్ ప్రొడక్షన్ క్లోజ్ సర్కిల్స్ నుండి వినిపించింది. అయితే.. ఇప్పుడు ఫైనల్ గా ఈ సినిమాని థియేటర్లలోనే విడుదలకి సిద్దమయ్యారట.

Shyam Singha Roy: డ్యూయెల్ రోల్.. శ్యామ్ సింగరాయ్ కథ ఇదే!

నిజానికి ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్‌కు ముందు రెండు వారాల చిత్రీకరణ మాత్రమే మిగిలుంది. సెకండ్ వేవ్ ముగిసి అన్ని సినిమాలు పనులు మొదలైనా ఈ సినిమా పరిస్థితి ఏంటన్నది ఎక్కడా బయటికి రాలేదు. అయితే, ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం బ్యాలెన్స్ షూటింగ్ కూడా పూర్తవగా.. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టనున్నారని.. ఇంతకు ముందు చేసుకున్న ఓటీటీ డీల్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారని చెప్తున్నారు. వీలును బట్టి జనవరి ఎండింగ్ లో కానీ ఫిబ్రవరి తొలి వారంలో కానీ ఇది రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు.