Shyam Singha Roy: డ్యూయెల్ రోల్.. శ్యామ్ సింగరాయ్ కథ ఇదే!

నేచురల్ స్టార్ నాని త్వరలోనే ‘శ్యామ్ సింగ రాయ్’గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్ లో..

Shyam Singha Roy: డ్యూయెల్ రోల్.. శ్యామ్ సింగరాయ్ కథ ఇదే!

Shyam Singha Roy

Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని త్వరలోనే ‘శ్యామ్ సింగ రాయ్’గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్ లో నటించనుండగా.. నాని సరసన సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి కథానాయకులుగా నటిస్తున్నారు. 1970 కాలం నాటి కలకత్తా బ్యాక్ డ్రాప్‏లో హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‏టైనర్‏గా రూపొందించగా భారీస్థాయిలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.

Sherry Agarwal: అందాల గాలమేస్తున్న షెర్రీ అగర్వాల్

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టిన యూనిట్ డిసెంబర్ 24న ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సినిమా నానీ కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ సినిమాగా మారనుందని ధీమాగా చెప్తున్నారు. కాగా, ఈ సినిమా గురించి.. కథ ఇదేనని సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ ఒకటి సాగుతుంది. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నాడనే విషయాన్ని మేకర్స్ ముందుగానే కన్ఫర్మేషన్ ఇచ్చేశారు. కాగా.. ఈ మధ్యనే విడుదల చేసిన టీజర్ ను బట్టి విశ్లేషకులు కథ ఇదేనని సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Telugu Multi Starrer Films: మల్టీస్టారర్ హవా.. డైరెక్టర్‌ల క్రేజీ కాంబోలు!

శ్యామ్ సింగరాయ్ సినిమా బెంగాల్ నేపథ్యంలో సాగే కథ కాగా ఒకప్పుడు కలకత్తాలో ఎక్కువగా ఉండే దేవదాసి వ్యవస్థ, దాని చుట్టూ అల్లుకున్న పరిస్థితులను ఎదురించే హీరో పోరాటంగా ఈ సినిమా సాగనుందట. ఇందులో సాయిపల్లవి దేవదాసిగా నటిస్తున్నట్లు అంచనా వేస్తుండగా.. ఇందులో నాని జర్నలిస్టుగా నటిస్తున్నాడని తెలుస్తోంది. కలకత్తాలో జరిగే దేవదాసి వ్యవస్థ ఆగడాలపై పోరాడే ఒక జర్నలిస్టు పాత్రలో ఒక నాని పాత్ర నటిస్తుండగా.. ఆ పాత్రతో నేటి నాని పాత్రను ముడిపెడుతూ కథా సాగుతుందని చెప్తున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే డిసెంబర్ 24 వరకు ఆగాల్సిందే.