Anubhavinchu Raja: రాజ్ తరుణ్ ఖాతాలో డజను ప్లాపులు.. గట్టెక్కుతాడా?

ప్రస్తుతం రాజ్ తరుణ్ స్టాండ్ అప్ రాహుల్, అనుభవించు రాజా అనే రెండు సినిమాలు చేస్తున్నాడు. ఇందులో అనుభవించు రాజా నవంబర్ 26న థియేటర్లలోకి రానుంది. కొన్ని రోజుల క్రితం విడుదలైన..

Anubhavinchu Raja: రాజ్ తరుణ్ ఖాతాలో డజను ప్లాపులు.. గట్టెక్కుతాడా?

Anubhavinchu Raja

Anubhavinchu Raja: ప్రస్తుతం రాజ్ తరుణ్ స్టాండ్ అప్ రాహుల్, అనుభవించు రాజా అనే రెండు సినిమాలు చేస్తున్నాడు. ఇందులో అనుభవించు రాజా నవంబర్ 26న థియేటర్లలోకి రానుంది. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్‌కి అద్భుతమైన స్పందన రాగా.. టైటిల్ సాంగ్ కూడా అందరినీ ఆకట్టుకుంది. మరోవైపు సినిమా యూనిట్ కూడా ప్రమోషన్ మొదలుపెట్టి తాజాగా రిలీజ్ అనౌన్సమెంట్ పేరుతో ఓ ఈవెంట్ కూడా నిర్వహించి కాస్త హడావుడి చేసింది. దీంతో మరోసారి రాజ్ తరుణ్ సినిమాపై కాస్త ఇంట్రెస్ట్ మొదలైంది.

Virata Parvam: ఓటీటీ డీల్ క్యాన్సిల్.. ప్లాన్ ఎందుకు మారింది?

రాజ్ తరుణ్ కి ఇప్పుడు గట్టి హిట్ ఒక్కటి పడాలి. కుమారి 21F తర్వాత డజను సినిమాలు చేసిన రాజ్ తరుణ్ అందులో ఎక్కువ భాగం ప్లాపుల ఖాతాలోనే వేశాడు. దీంతో ఇప్పుడు అర్జెంట్ గా హిట్ కావాలి. అందుకే అనుభవించు రాజా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. ఈసారి ఈ సినిమా సక్సెస్ కొట్టేందుకు మంచి అవకాశాలు కూడా ఉన్నాయి. నవంబర్ 26న విడుదల కాబట్టి.. ఈ సమయంలో 2 నుండి 3 వారాల వరకు పెద్ద పోటీ లేదు. కాబట్టి ఈ సినిమాకి ఇది మంచి అవకాశంగా కనిపిస్తుంది.

Mahesh-Rajamouli: క్రేజీ కాంబో కోసం విక్రమ్ డేట్స్.. ఇందులో నిజమెంత?

గవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌లపై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. రాజ్ తరుణ్ తొలి సినిమా ఉయ్యాలా జంపాల కూడా అన్నపూర్ణ బ్యానరే నిర్మించగా.. ఇప్పుడు ఇలా మళ్ళీ మరోసారి సరిగ్గా అలాంటి కథతోనే మరో సినిమా చేస్తుంది. టీజర్, ట్రైలర్ ను బట్టి చూస్తే సినిమా కూడా హిలేరియస్ ఎంటర్టైనర్ గా కనిపిస్తుంది. మరి రాజ్ తరుణ్ ఈ గండం నుండి గట్టెక్కుతాడా అన్నది చూడాలి.