Prakash Raj : సినిమాల్లో న‌టించే ఆడవాళ్ళంటే చిన్న‌చూపా? కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై ప్ర‌కాశ్ రాజ్ కౌంట‌ర్‌

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ మండిప‌డ్డారు.

Prakash Raj comments on Minister konda Surekha

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ మండిప‌డ్డారు. ఏంటీ సిగ్గులేని రాజ‌కీయాలు, సినిమాల్లో న‌టించే ఆడవాళ్ళంటే చిన్న చూపా ? అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌శ్నించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడిన వీడియోను సైతం పోస్ట్ చేశారు.

మంత్రి కొండా సురేఖ ఏం మాట్లాడిందంటే ?

త‌న‌పై సోష‌ల్ మీడియాలో బీఆర్ఎస్ నేత‌లు చేస్తున్న ట్రోలింగ్‌ను కేటీఆర్ స‌మ‌ర్థించిన‌ట్లుగా మాట్లాడ‌డం పై మంత్రి కొండా సురేఖ తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో కేటీఆర్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. హీరోయిన్ల జీవితాల‌తో కేటీఆర్ ఆడుకున్నార‌న్నారు. హీరోయిన్ల‌కు డ్ర‌గ్స్ అల‌వాటు చేశార‌ని ఆరోపించారు.

Bigg Boss 8 : మ‌ణికంఠ విష‌యంలో య‌ష్మి కొత్త శ‌ప‌థం..

నాగ‌చైత‌న్య‌, స‌మంత విడాకులు తీసుకోవ‌డానికి కార‌ణం అత‌డేన‌న్నారు. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్ప‌డి వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను తెలుసుకుని వాళ్ల‌ను బ్లాక్ మెయిల్ చేశార‌న్నారు. కొంత మంది హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయ‌కుండా త్వ‌ర‌గా పెళ్లి చేసుకోవ‌డానికి కూడా కేటీఆరే కార‌ణం అని ఆరోపించారు. దుబాయ్‌లో మ‌నుషుల‌ను పెట్టి పోస్టులు పెట్టిస్తున్నార‌ని ఆరోపించారు.