MAA Elections ‘మా’ వివాదంలో మరో ట్విస్ట్.. సీసీ టీవీ ఫుటేజ్‌ సీజ్?

ఎన్నికల అధికారులు మాత్రం సీసీ టీవీ ఫుటేజ్‌ని పోలీసులు సీజ్ చేసినట్లుగా చెబుతున్నారు.

MAA Elections ‘మా’ వివాదంలో మరో ట్విస్ట్.. సీసీ టీవీ ఫుటేజ్‌ సీజ్?

Maa Cc Footage

Updated On : October 17, 2021 / 11:13 AM IST

MAA Elections CC TV Footage: ఎన్నికల వేళ ఇబ్బందికర పరిస్థితులు చోటుచేసుకున్నాయని, మోహన్ బాబు చేయిచేసుకున్నారని ఆరోపిస్తూ.. అందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ కావాలని ప్రకాష్ రాజ్ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌కు విజ్ఞప్తి చేసుకున్నారు.

అయితే, ఎన్నికల అధికారులు మాత్రం సీసీ టీవీ ఫుటేజ్‌ని పోలీసులు సీజ్ చేసినట్లుగా చెబుతున్నారు. ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ కూడా ఇప్పుడు సీసీ టీవీ ఫుటేజ్ ఇవ్వలేమంటూ చెబుతున్నారు.

అంతకుముందు సీసీటీవీ ఫుటేజ్ ఇస్తామంటూ.. ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు ఎన్నికల అధికారిని ప్రశ్నిస్తున్నారు.

జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్ రెడ్డి ఆఫ్ ది రికార్డ్.. ఫోన్‌లో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ సీసీ కెమెరా సర్వర్ రూమ్‌కి మేము లాక్ వేయలేదని చెబుతున్నారు. పోలీసులకు ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

స్కూల్‌కి సెలవు కావడంతో వాళ్లే లాక్ వేసుకొని వెళ్లారని చెబుతున్నారు. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ సీజ్ చేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు.