Prakash Raj Speech About Maa Elections
Prakash Raj: సీఎంలైన కేసీఆర్, జగన్ పేర్లతో మాపై ప్రచారం చేయడం ఆశ్చర్యకరంగా ఉందని కాస్త ఆగితే బైడన్ ను కూడా తెస్తారేమో అంటూ నటుడు ప్రకాష్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ప్రకాష్ రాజ్.. ‘మా’ ఎందుకు అందరికి ఎంటర్ టైన్ మెంట్ గా మారిందని ప్రశ్నించారు. చూస్తూ ఊరుకోలేక చిత్తశుద్ధితో, విజన్ తో ముందుకొచ్చామని చెప్పారు.
‘మా’ చాలా సున్నితమైన అంశమని.. ఇక్కడ కనిపిస్తున్న వారు కాకుండా ఎంతో మంది వెనకున్నారని.. ఒక వెల్ ఫెర్ అసోసియేషన్ లో ఇలాంటి వాతావరణ మంచిది కాదన్నారు. మేము పదవి కోసం పోటీచేయడం లేదన్న ప్రకాష్ రాజ్.. నా ప్యానల్ లో నలుగురు ప్రెసిడెంట్ అభ్యర్థులు ఉన్నారని.. ఇక్కడ అందరూ కలిసి పనిచేసి తోటివారికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నామన్నారు. నేను తప్పుచేస్తే నన్నే బయటికి పంపిస్తారన్నారు.
రెండు మూడు రోజుల నుంచి మీడియాలో వస్తున్న వార్తలను చూసి ఈ ప్రెస్ మీట్ పెట్టమని.. అసలు దీనిలోకి చిరంజీవి, మోహన్ బాబులను ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. మా భవనం ఎక్కడ ఎలా కడతాం అనేది అందరూ అడుగుతున్నారని.. కానీ అందరూ గర్వపడేలా దాని నిర్మాణం చేపడతామన్నారు. ప్రతి రోజు పెద్దలతో మాట్లాడుతున్నామని.. పదవి కోసం ఇక్కడకు రాలేదు.. నాకు ఇక్కడ అందరూ మిత్రులేనన్నారు.
Praksh Raj Panel
నాకు ప్రశ్నించే వాళ్ళు కావాలి.. నిలదీసే వాళ్ళు కావాలి అనుకుంటే.. అలాంటి వాళ్ళే మా ప్యానెల్ సభ్యులుగా ఉన్నారన్నారు. మా ప్యానల్ లో అందరూ కష్టపడి ఎదిగిన వాళ్లే ఉన్నారని.. మాను క్లీన్ చేస్తామన్నారు. ప్రణాళికలు తెస్తాం .. సంస్కరణలు తెస్తాం .. ‘మా’ను చూసి అందరు ఆశ్యర్యపడేలా పనిచేస్తామని ప్రకాష్ రాజ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ తో పాటు శ్రీకాంత్, ఉత్తేజ్, సమీర్, సన, బెనర్జీ, నాగినీడు, అనసూయ, ఏడిద శ్రీరామ్, ప్రగతి, తనీష్, అజయ్ తదితరులు హాజరయ్యారు.
Read: Prakash Raj: మా చాలా చిన్న అసోషియేషన్.. పొలిటికల్ పార్టీ కాదు..