Praneeth Pattipati
Praneeth Pattipati : ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘పతంగ్’. రిషన్ సినిమాస్ బ్యానర్ పై విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి నిర్మాణంలో ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. గాలిపటాల స్పోర్ట్స్ డ్రామా, లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన పతంగ్ సినిమా ఇటీవల డిసెంబర్ 25న రిలీజయి మంచి విజయం అందుకుంది. చాలా కొత్త కాన్సెప్ట్ తో, ఫ్రెష్ విజువల్స్ తో ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుంది.(Praneeth Pattipati)
తాజాగా పతంగ్ విజయంతో దర్శకుడు ప్రణీత్ పత్తిపాటి మీడియాతో మాట్లాడాడు. పతంగ్ సినిమా ఆలోచన, తన గురించి మాట్లాడుతూ.. నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను. రామానాయుడు ఫిల్మ్ స్కూల్లో చదివాను. ఇదే నా మొదటి సినిమా. ఒక సంక్రాంతి రోజు నాకు అనిపించింది. మనం ఫారిన్ నుంచి తీసుకొచ్చిన ఆటలు, రగ్బి లాంటి స్టోరీతో సినిమాలు తీశాం కానీ ఇది మన నేటివిటి స్పోర్ట్స్ కదా దీని మీద మనం ఎందుకు తీయలేము అని పతంగ్ మొదలుపెట్టాను అని తెలిపాడు.
Also Read : Patang Review : ‘పతంగ్’ రివ్యూ.. అమ్మాయి కోసం బెస్ట్ ఫ్రెండ్స్ పతంగ్ ఫైట్.. భలే కొత్తగా ఉందే సినిమా..
ఈ సినిమా సిజి వర్క్ గురించి, ఆలస్యంగా విడుదల అవ్వడం గురించి చెప్తూ.. సినిమా మొదలు పెట్టిన తరువాత ఇన్నాళ్లు అందరూ ఎందుకు తీయలేదో అర్థమైంది. దానికి కారణం సీజీ వర్క్. సీజీ వర్క్‌కు చాలా సమయం పట్టింది. మొదట ఒకరికి ఇస్తే వాళ్ళు సరిగ్గా చేయలేదు. సీజీ వర్క్‌కు దాదాపు రెండేళ్లు పట్టింది. సినిమా లేట్ అవ్వడానికి క్లైమాక్స్ సన్నివేశాల్లో వచ్చే సీజీ వర్కే కారణం. ఎటువంటి రిఫరెన్స్ లేకపోవడంతో సీజీకి చాలా సమయం తీసుకున్నాం. కైట్ ఎగిరేది ఒరిజినల్ గా అనిపించేలా వచ్చే వరకు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. విజయవాడకు చెందిన ఓ ఫ్రీలాన్స్ టీమ్ వర్క్ చేసారు అని తెలిపారు.
నిర్మాతల గురించి మాట్లాడుతూ.. సినిమా మూడేళ్లు అయినా నిర్మాతలు సపోర్ట్ ఇచ్చారు. ఒక్క సీన్ ముందు అనుకోని తర్వాత వద్దనుకున్నా నిర్మాతలు సపోర్ట్ చేసి పెట్టించారు. విజువల్స్ కూడా రిచ్ గా, కలర్ ఫుల్ గా ఉన్నాయని అంటున్నారు. సినిమా అంత క్వాలిటీగా రావడానికి నిర్మాతల సపోర్ట్ కారణం అని తెలిపారు.
అలాగే సినిమా చూసి వస్తున్న స్పందనల గురించి మాట్లాడుతూ.. టాక్‌తో పాటు కలెక్షన్లు పెరుగుతున్నాయి. యూనివర్సల్‌గా ఈ సినిమాకు హిట్‌టాక్ వచ్చింది. అందరూ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో పతంగ్ ఫైట్ స్టేడియంలో ఓ మ్యాచ్‌ను చూస్తున్నఅనుభూతికి లోనవుతున్నారు. ఇండస్ట్రీ నుంచి కూడా ఎస్‌కేఎన్, సందీప్‌కిషన్, బెల్లంకొండ సురేష్, దిల్ రాజు.. మరికొంతమంది అభినందించారు. రివ్యూలు కూడా చాలా బాగా వచ్చాయి అని సంతోషం వ్యక్తం చేసారు.
Also Read : Rajasaab Working Stills : ప్రభాస్ ‘రాజాసాబ్’ వర్కింగ్ స్టిల్స్.. షేర్ చేసిన డైరెక్టర్ మారుతీ కూతురు..
అయితే ఈ సినిమా కరెక్ట్ డేట్ కి రిలీజ్ అవ్వలేదు, థియేటర్స్ దొరకలేదు అనే దానిపై స్పందిస్తూ.. థియేటర్లు ట్రై చేస్తున్నాం. సినిమా తీయడంతోనే అయిపోయింది అనుకునేవాడ్ని. కానీ సినిమా తీసిన తరువాత అసలు కథ ఉంది అని ఇప్పుడే తెలిసింది. ప్రమోషన్, రిలీజ్ లో ఇంత కష్టం అని ఈ సినిమాతోనే తెలిసింది. మౌత్‌టాక్‌తో సినిమా బాగుంది అని తెలిసినా సరైన థియేటర్లు, టైమింగ్స్ లేకపోవడంతో సినిమా బాగున్నా జనాలకు అందుబాటులో లేకపోవడంతో చూడలేకపోతున్నారు అని తెలిపాడు. అలాగే ఈ సినిమా అమెరికాలో జనవరి 1న రిలీజ్ కానుంది అని తెలిపాడు.
ఈ సినిమాలో స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ మీనన్ కీలక పాత్రలో కనిపించారు. ఆయన గురించి మాట్లాడుతూ.. స్క్రిప్ట్‌లో ఆ పాత్రకు మొదట సందీప్ రెడ్డి వంగా, దిల్‌రాజు, ఎస్‌జే, సూర్య నాగ్ అశ్విన్.. ఇలా చాలా మందిని అనుకున్నాము. కానీ వర్కింగ్ డేస్ ఎక్కువగా ఉండటం వల్ల ఒప్పుకోలేదు. గౌతమ్ మీనన్ గారికి కథ, ఆయన పాత్ర, ఆయన మీద వేసిన కౌంటర్లు నచ్చి ఒప్పుకున్నారు అని తెలిపాడు.