Pranitha Subhash : మలయాళ సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్ ప్రణీత.. తల్లి అయ్యాక మొదటి సినిమా!

తెలుగులో స్టార్ హీరోల పక్కన నటించిన ప్రణీత 2021లో పెళ్లి చేసుకొని అందరికి షాక్ ఇచ్చింది. 2022లో ఒక పాపకి జన్మనిచ్చి తల్లి కూడా అయ్యింది. ఇప్పుడు మళ్ళీ సినిమాలోకి రీ ఎంట్రీ ఇస్తుంది. అది కూడా ఒక స్టార్ హీరో..

pranita

Pranitha Subhash : కన్నడ సినిమాతో వెండితెరకి పరిచయమైన హీరోయిన్ ‘ప్రణీత’. తెలుగులోకి ‘ఏం పిల్లో ఏం పిల్లాడో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. టాలీవుడ్ లోని స్టార్ హీరోల పక్కన నటించే ఛాన్స్ లు అందిపుచ్చుకుంది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్.. ఇలా టాప్ స్టార్స్ కి జోడిగా నటించింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ 2021లో పెళ్లి చేసుకొని అందరికి షాక్ ఇచ్చింది. 2022లో ఒక పాపకి జన్మనిచ్చి తల్లి కూడా అయ్యింది. దీంతో ప్రణీత ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుంది అనుకున్నారు.

Pranitha Subhash : తల్లి అయిన తర్వాత మొదటిసారి బోల్డ్ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్ ప్రణీత

కానీ గత కొంత కాలంగా వరుస ఫోటోషూట్ లు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హల్ చల్ చేస్తుంది. ఈ ఫొటోలతో తాను సినిమాలకు దూరం కాలేదు అని ప్రేక్షకులతో పాటు మేకర్స్ కి కూడా ఒక క్లారిటీ ఇచ్చింది ప్రణీత. దీంతో ఇప్పుడు ఆఫర్లు వెతుకుంటూ ప్రణీత దగ్గరకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే మలయాళ స్టార్ హీరో పక్కన నటించే అవకాశం కొట్టేసింది. మలయాళ హీరో దిలీప్ 148వ సినిమాలో ప్రణీతని ఎంపిక చేశారు చిత్ర యూనిట్. ఈ విషయాన్ని ప్రణీత తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.

తల్లి అయ్యాక ప్రణీతకి ఇది మొదటి సినిమా. అంతేకాదు ఈ చిత్రంతో మొదటిసారి మలయాళ సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతుంది. ఈ మూవీ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి తమిళ హీరో జీవ కూడా హాజరయ్యాడు. నిజ జీవితంలో జరిగిన కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీని సూపర్ గుడ్ ఫిల్మ్స్ మరియు ఐఫార్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రతీష్ రఘునందన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రణీత సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.