Prasanth Varma – Nag Ashwin : ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో రామాయణం.. కల్కి సినిమాటిక్ యూనివర్స్‌లో మహాభారతం..

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో రామాయణ పాత్రలు, సన్నివేశాలు, కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో మహాభారత పాత్రలు, సన్నివేశాలు చూపించబోతున్నట్టు తెలుస్తుంది.

Prasanth Varma Cinematic Universe with Ramayanam Kalki Cinematic Universe with Mahabharatham

Prasanth Varma – Nag Ashwin : ఒకప్పుడు ఒక సినిమాకి ఇంకో సినిమాకి లింక్ ఇస్తూ సినిమాటిక్ యూనివర్స్ పేర్లతో హాలీవుడ్ లోనే సినిమాలు వచ్చాయి. కానీ ఆ సినిమాటిక్ యూనివర్స్ ఇప్పుడు ఇండియాలో, టాలీవుడ్ లోకి కూడా వచ్చేసింది. తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ప్రకటించి తన సినిమాల్లో ప్రతి దానికి ఏదో ఒక లింక్ ఇవ్వడంతో ఈ యూనివర్స్ లపై అభిమానులు, ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

బాలీవుడ్ లో యశ్ రాజ్ ఫిలిమ్స్ తమ స్పై సినిమాలని కలిపి స్పై యూనివర్స్ అనౌన్స్ చేసాయి. ఇక తెలుగులో హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనౌన్స్ చేసాడు. ఇటీవల జనవరిలో సంక్రాంతికి హనుమాన్ సినిమాతో చిన్న సినిమాగా వచ్చి భారీ హిట్ కొట్టి ఏకంగా 350 కోట్లు కలెక్ట్ చేశారు. ఈ సినిమాలో రామాయణంలోని హనుమంతుడు. విభీషణుడు పాత్రలు ఉన్నాయి. ఈ పాత్రలకు థియేటర్స్ లో రెస్పాన్స్ అదిరిపోయింది. ఈ సినిమాకు సీక్వెల్ జై హనుమాన్ ప్రకటించడమే కాకుండా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ప్రకటించారు.

Also Read : Pekamedalu Trailer : ‘పేకమేడలు’ ట్రైలర్ చూశారా? భార్య సంపాదిస్తుంటే భర్త ఏం చేస్తున్నాడు అంటే..

ఈ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో చాలా సినిమాలు రానున్నాయి. హనుమాన్ సినిమాలోని క్యారెక్టర్స్ నెక్స్ట్ సినిమాలో ఉండనున్నాయి. అంతే కాకుండా రామాయణంలోని పాత్రలు కూడా రానున్నాయని హనుమాన్ క్లైమాక్స్ చూస్తే తెలుస్తుంది. అలాగే మన పురాణాల్లో ఉన్న ఏడుగురు చిరంజీవులు కూడా ఈ యూనివర్స్ లో కనిపిస్తారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాటిక్ యూనివర్స్ లో ఎన్ని పాత్రలు వచ్చినా కథ ఎక్కువగా రామాయణంలోని పాత్రల చుట్టూ, హనుమంతుడి చుట్టే తిరుగుతుందని సమాచారం. దీంతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో పూర్తి రామాయణం చూపించకపోయినా రామాయణంలోని పాత్రలు, కొన్ని సన్నివేశాలు చూపిస్తారని తెలుస్తుంది.

ఇక ఇటీవల ప్రభాస్ కల్కి సినిమాతో కల్కి సినిమాటిక్ యూనివర్స్ ప్రకటించారు దర్శకుడు నాగ్ అశ్విన్. కల్కి సినిమా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చి పెద్ద హిట్ చేసేసారు. ఈ సినిమాలో మహాభారతం సీన్స్, మహాభారతంలోని కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామ, ఉత్తర.. పాత్రలు సినిమాలో చూపించారు. సినిమా క్లైమాక్స్ చూపించిన దాని ప్రకారం, అలాగే నాగ్ అశ్విన్ కల్కి సినిమాటిక్ యూనివర్స్ గురించి చెప్పిన దాని బట్టి ఈ యూనివర్స్ మహాభారతం చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది.

Also Read : Sindhooram Song : ‘అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే..’ ఇంత గొప్ప పాట సినిమా కోసం ముందు రాయలేదా? సిగరెట్ పెట్టె మీద లిరిక్స్ రాసి..

కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో కల్కి సినిమాలో చూపించిన మహాభారత పాత్రలు అన్ని వస్తాయి, అలాగే మరిన్ని పాత్రలు కూడా వస్తాయని ఆల్రెడీ నాగ్ అశ్విన్ చెప్పారు. అలాగే మహాభారతంలోని కొన్ని సన్నివేశాలు కూడా చూపించనున్నారు అని తెలుస్తుంది. అయితే కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో రెండు సినిమాలే అని, కుదిరితే ఈ సినిమాల్లోని పాత్రలతో సపరేట్ సినిమాలు తీస్తామని చెప్పారు నాగ్ అశ్విన్. దీంతో కల్కి పార్ట్ 2లో మహాభారతం మొత్తం చూపించకపోయినా ఫస్ట్ పార్ట్ లాగే కొన్ని సీన్స్, కొన్ని పాత్రలు చూపిస్తారని మాత్రం తెలుస్తుంది.

ఇలా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో రామాయణ పాత్రలు, సన్నివేశాలు, కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో మహాభారత పాత్రలు, సన్నివేశాలు చూపించబోతున్నట్టు తెలుస్తుంది. మన రామాయణ మహాభారతాలని డైరెక్ట్ గా మొత్తం చూపించకుండా ఇలా ప్రస్తుత కథలకు లింక్ ఇస్తూ ఆసక్తిగా చూపిస్తున్నారు. దీంతో ప్రశాంత్ వర్మ, నాగ్ అశ్విన్ నుంచి రాబోయే సినిమాలపై భారీ అంచనాలు ఉండటమే కాక వారి సినిమాల కోసం అభిమానులు, ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు