Prasanth Varma MokshNandamuri movie update shotting date fix
బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం ఫిక్సైంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా ఉండనున్నట్లు ఇప్పటికే అనౌన్స్ మెంట్ వచ్చేసింది. అయితే.. ఇంత వరకు ఈ చిత్రానికి సంబంధించిన మరే అప్‌డేట్ రాలేదు. ఈ చిత్రంలో ఎవరెవరు నటిస్తున్నారు. సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అన్న వివరాలు తెలియరాలేదు.
తాజాగా ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ ఫోటోను పోస్ట్ చేశాడు. యాక్షన్‌కు సిద్ధంగా ఉండండి అంటూ రాసుకొచ్చాడు. దర్శకుడి కామెంట్ చూస్తుంటే.. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది అని అర్థమవుతోంది.
కాగా.. అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 5 నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు.
Allu Arjun : ‘పుష్ప 2’ ఫస్ట్ డే కలెక్షన్స్ పై అల్లు అర్జున్ ఫోకస్..!
ప్రశాంత్ వర్మ పోస్ట్ చేసిన ఫోటోలో మోక్షజ్ఞ లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Ready for some action? @MokshNandamuri 💥💥💥#SIMBAisCOMING pic.twitter.com/dep3A1Whv9
— Prasanth Varma (@PrasanthVarma) November 29, 2024