HanuMan : హనుమంతుడు వచ్చే సీన్‌ని.. అయోధ్య రామ మందిరం దగ్గర చేయాల్సి ఉంది.. కానీ..

హనుమాన్ సినిమాలో హనుమంతుడు వచ్చే సీన్‌ని అయోధ్య రామ మందిరం బ్యాక్‌డ్రాప్ లో కూడా తీయాల్సి ఉందట. కానీ..

prasanth Varma said HanuMan entry scene would be in ayodhya ram mandir backdrop

HanuMan : ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ‘హనుమాన్’ సినిమా.. థియేటర్స్ లో ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనే ఉంది. మూవీ ఎండింగ్ లో ధ్యానం నుంచి మేల్కొని హనుమంతుడు వచ్చే సీన్ కోసం.. ఆడియన్స్ రిపీటెడ్ గా థియేటర్స్ కి వస్తున్నారు. ఎక్కడో హిమాలయాల్లో ధ్యానంలో ఉన్న ఆంజనేయుడు.. విభీషణుడి మాటతో మేల్కొని బయటకి వస్తాడు. అక్కడి నుంచి వాయువేగంతో హీరో దగ్గరకి వస్తాడు.

ఇలా హిమాలయం నుంచి హీరో దగ్గరకి వచ్చే సమయంలో కొన్ని సీన్స్ ని చూపిస్తారు. ఈక్రమంలోనే వారణాసిలో ఒక ముని ధ్యానం చేస్తుండగా హనుమాన్ ఆకాశంలో వాయువేగంతో వెళ్లడంతో.. ఆ ముని కళ్ళు తెరిచి పైకి చూస్తాడు. అయితే సినిమాలో ఈ సీన్ కి బదులు మరో సీన్ తెరకెక్కించాల్సిందట. ఆ సీన్ ని అయోధ్య రామ మందిరం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించాలని ప్రశాంత్ వర్మ.. ఓ సన్నివేశాన్ని రాసుకున్నారట.

Also read : Chiranjeevi : చిరంజీవి గారిని తిట్టినందుకు సిగ్గుపడుతున్నా.. క్షమించమంటూ రైటర్ చిన్నికృష్ణ వీడియో..

అయోధ్య రామ మందిరం ఎదురుగా ఉన్న దీపాలను ఒక పాప వెలిగించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే అవి గాలికి ఆరిపోతూ ఉంటాయి. ఆ సమయంలో హనుమాన్ పైన వెళ్లడంతో.. ఒక్కసారిగా ఆ దీపాలు అన్ని వాటికీ ఏవ్ వెలుగుతాయి. ఇలా ఆ సీన్ ని ప్రశాంత్ వర్మ రాసుకున్నారు. కానీ అది తీయడం కుదరలేదట. ఈ విషయాన్ని ప్రశాంత్ వర్మ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఇక ఈ మాటలు విన్న ఆడియన్స్.. ఆ సీన్ ఒకవేళ సినిమాలో ఉండి ఉంటే, గూస్‌బంప్స్ వచ్చి ఉండేవి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే, ఈ మూవీ సీక్వెల్ ‘జై హనుమాన్’లో ఆంజనేయుడు పాత్రని ఎవరు పోషించబోతున్నారని పెద్ద చర్చ జరుగుతుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. చిరంజీవి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరి ఆ పాత్రలో చిరంజీవి కనిపిస్తారా లేదా చూడాలి.

ట్రెండింగ్ వార్తలు