NTR31 : ఎన్టీఆర్ సినిమా గురించి ప్రశాంత్ నీల్ కామెంట్స్.. కేజీఎఫ్, సలార్‌లా కాకుండా..

సలార్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రశాంత్ నీల్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో NTR31 గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

NTR31 : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర, వార్ 2 సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ కూడా సలార్ రెండు భాగాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. వీరిద్దరి ఈ కమిట్మెంట్స్ పూర్తి అయ్యిన తరువాతే NTR31 ని పట్టాలు ఎక్కించబోతున్నారు. కాగా ప్రశాంత్ నీల్, ప్రభాస్ సలార్ మూవీ రిలీజ్ కి సిద్దమైన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నీల్ ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు.

ఈక్రమంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ NTR31 గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇది కేజీఎఫ్, సలార్‌ చిత్రాలులా కాకుండా కొత్త జోనర్ తో ఉండబోతుందని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు. తన జోనర్ దాటి ఒక కొత్త ఎమోషన్ తో ఆ సినిమా చేయబోతున్నట్లు, అది ఆడియన్స్ కి కచ్చితంగా నచ్చుతుందని ప్రశాంత్ నీల్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.

Also read : Hi Nanna Review : హాయ్ నాన్న మూవీ రివ్యూ.. నాన్న సెంటిమెంట్ మాత్రమే కాదు.. ప్రేమ సన్నివేశాలతో కూడా..

ఇక ఎన్టీఆర్ దేవర విషయానికి వస్తే.. రెండు భాగాలుగా ఈ మూవీ తెరకెక్కుతుంది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఫిబ్రవరి లోపు ఆల్మోస్ట్ పూర్తి అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏప్రిల్ 5న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

వార్ 2 విషయానికి వస్తే.. ఆల్రెడీ షూటింగ్ మొదలయింది. హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ విలన్ పాత్ర చేయబోతున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమా బాలీవుడ్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతుంది. ఇక ఈ యూనివర్స్ మొత్తానికి ఎన్టీఆర్ మెయిన్ విలన్ కాబోతున్నాడని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని 2025 ఆగష్టులో రిలీజ్ చేయనున్నారు.

ట్రెండింగ్ వార్తలు