Prashanth Varma : ఇక నుంచి ప్రతి సంక్రాంతికి ఓ సూపర్ హీరో సినిమా.. హనుమాన్ డైరెక్టర్ ఆసక్తికర ప్రకటన..

తాజాగా హనుమాన్ సక్సెస్ తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ తన సినిమాల గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు.

Prashanth Varma Interesting Comments on his Super Hero Movies after Hanuman Success

Prashanth Varma : ఈ సంక్రాంతికి హనుమాన్(Hanuman) సినిమా రిలీజయి థియేటర్స్ లో దుమ్ము దులిపేస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు హనుమాన్ సినిమా బాగా నచ్చేసింది. రిలీజ్ కి ముందు థియేటర్ల ఇబ్బందులు, బడ్జెట్ ప్రాబ్లమ్స్.. ఇలా చాలా కష్టాలు పడి మూడేళ్ళ పాటు సినిమాని చేసి రిలీజ్ చేశారు. ఆ కష్టానికి ప్రతిఫలం వచ్చింది. కలెక్షన్స్ కూడా భారీ రేంజ్ లో వస్తున్నాయి.

దీంతో చిత్రయూనిట్ అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మని ఇంత మంచి సినిమా తీసినందుకు అంతా అభినందిస్తున్నారు. హనుమాన్ సినిమాకు జై హనుమాన్ సీక్వెల్ కూడా ప్రకటించి ఆ సినిమా కోసం కూడా అందరిని ఎదురుచూసేలా చేశారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గతంలోనే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ని ప్రకటించి అందులో దాదాపు 20 సినిమాల వరకు ఉంటాయని, ఒకదాంతో ఒకటి లింక్ పెట్టి భారీ మల్టీ యూనివర్స్ కూడా సృష్టిస్తున్నాని అని తెలిపాడు.

తాజాగా హనుమాన్ సక్సెస్ తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ తన సినిమాల గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. నా సినిమాటిక్ యూనివర్స్ లో దాదాపు 20 సినిమాలు ఉన్నాయి. 20 సూపర్ హీరోలు ఉంటారు. ఫస్ట్ ఫేజ్ లో ఆరు సూపర్ హీరోల సినిమాలు తీస్తాను. ఆ తర్వాత మిగిలినవి వస్తాయి. అవన్నీ నేనే డైరెక్ట్ చేయను. కొత్త దర్శకులు కూడా పరిచయం అవుతారు. వీటిల్లో జై హనుమాన్ తో పాటు, అధీర సినిమాలు అనౌన్స్ చేశాము. సూపర్ వుమెన్ సినిమాలు కూడా ఉంటాయి. ఇవే కాకుండా ఈ సినిమాటిక్ యూనివర్స్ కి సంబంధం లేకుండా ఇంకో సినిమా చేస్తున్నాను. త్వరలోనే వాటి వివరాలు చెప్తాను. ఇక నుంచి కుదిరితే ప్రతి సంక్రాంతికి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఓ సినిమా ఉంటుంది అని అన్నారు.

Also Read : Trivikram Movies : త్రివిక్రమ్ సినిమాల్లో మరదళ్ళు.. త్రిష నుంచి మీనాక్షి చౌదరి దాకా.. ‘అతడు’ నుంచి ‘గుంటూరు కారం’ దాకా..

దీంతో ప్రశాంత్ వ్యాఖ్యలు టాలీవుడ్ లో వైరల్ గా మారాయి. ఈ సంక్రాంతికే(Sankranthi) హనుమాన్ వెనక్కి తగ్గనందుకు పలు సమస్యలతో, అతనిపై వచ్చిన కామెంట్స్ తో ప్రశాంత్ బాగా వైరల్ అయ్యాడు. ఇక ప్రతి సంక్రాంతికి వస్తాను అంటే మిగిలిన వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. కానీ హనుమాన్ సినిమాతో ప్రశాంత్ నెక్స్ట్ సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూసేలా చేశాడు.