Trivikram Movies : త్రివిక్రమ్ సినిమాల్లో మరదళ్ళు.. త్రిష నుంచి మీనాక్షి చౌదరి దాకా.. ‘అతడు’ నుంచి ‘గుంటూరు కారం’ దాకా..

త్రివిక్రమ్ తన సినిమాల్లో కొన్ని కాంబినేషన్స్, నటుల్ని రెగ్యులర్ గా రిపీట్ చేస్తాడు. అలాగే సినిమాల్లో ఎమోషన్స్, రిలేషన్స్ కూడా రిపీట్ చేస్తాడు.

Trivikram Movies : త్రివిక్రమ్ సినిమాల్లో మరదళ్ళు.. త్రిష నుంచి మీనాక్షి చౌదరి దాకా.. ‘అతడు’ నుంచి ‘గుంటూరు కారం’ దాకా..

Trivikram Creates Sister in Law Character and Emotion Regularly in his Movies Athadu to Guntur Kaaram Repeats so Many Times

Updated On : January 14, 2024 / 9:56 PM IST

Trivikram Movies : త్రివిక్రమ్ సినిమాలంటే ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. అతని సినిమాల్లో మాటలతో మాయ చేసేస్తాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో మెప్పిస్తాడు. బంధాలకు, బంధుత్వాలకు విలువిస్తాడు. మంచితనానికి మర్యాదిస్తాడు. వాటితో పాటు హీరోలకు ఎలివేషన్స్ ఇస్తాడు. కమెడియన్స్ తో కామెడీ పండిస్తాడు. హీరోయిన్స్ ని అందంగా కూడా చూపిస్తాడు. అయితే త్రివిక్రమ్ తన సినిమాల్లో కొన్ని కాంబినేషన్స్, నటుల్ని రెగ్యులర్ గా రిపీట్ చేస్తాడు. అలాగే సినిమాల్లో ఎమోషన్స్, రిలేషన్స్ కూడా రిపీట్ చేస్తాడు. కానీ సినిమాల్లో అలా రిలేషన్స్, ఎమోషన్స్ రిపీట్ చేసినా ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రతిసారీ కొత్తగా చూపిస్తాడు.

ఇప్పుడు ఈ సంక్రాంతికి త్రివిక్రమ్ మహేష్ బాబుతో కలిసి గుంటూరు కారం(Guntur Kaaram) సినిమాతో వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో మంచి విజయంతో దూసుకుపోతుంది. ఇప్పటికే గుంటూరు కారం సినిమా 130 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.

గుంటూరు కారం ఈ సినిమాలో మహేష్ మరదలిగా మీనాక్షి చౌదరి నటించింది. సినిమాలో ఎక్కువగా కనిపించే స్కోప్ లేకపోయినా హీరో ఇంట్లో ఒక మనిషిలా, హీరోకి మరదలు అనే ఫీల్ తో ఆడియన్స్ మైండ్ లో సెట్ చేసేస్తాడు త్రివిక్రమ్. అయితే ఈ మరదలు క్యారెక్టర్స్ ఇప్పుడు కాదు తన కెరీర్ మొదటి నుంచే వస్తున్నాయి. ఆయన సినిమాల్లో ఇద్దరు హీరోయిన్స్ ఉండి, ఒక హీరోయిన్ కి మరదలు పాత్రని పెట్టడం మరో విశేషం. గత మూడు సినిమాల్లో మరదలు క్యారెక్టర్ ఉండటం, ఆ పాత్ర కోసం సపరేట్ క్యారెక్టర్ డిజైన్ చేయడం గమనార్హం.

Also Read : Samantha : సమంతకు పూలంటే పడవా? వాటివల్లే హాస్పిటల్ కి వెళ్లాల్సి వచ్చిందని..

త్రివిక్రమ్ రైటర్ గా పనిచేసిన చిరునవ్వుతో సినిమాలో హీరో వేణుకి మరదలు క్యారెక్టర్ లో ప్రేమ(Prema) ఉంటుంది. ఈ రిలేషన్, సినిమాలో వీరి మధ్య సీన్స్ చాలా ఎమోషనల్ గా ప్రేక్షకులని మెప్పిస్తాయి. అయితే ఇందులో ప్రేమ రెండో హీరోయిన్, మెయిన్ హీరోయిన్ గా షహీన్ అనే మరో అమ్మాయి ఉంటుంది. ఇక దర్శకుడిగా మారాక అతడు సినిమాలో హీరో మహేష్ బాబు పాత్రకి త్రిషని మరదలుగా పెట్టాడు. ఇందులో మాత్రం ఒకటే హీరోయిన్ అయినా మరదలు పాత్ర అవడం విశేషం. ఆ తర్వాత అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ కి సమంత(Samantha), ప్రణీత మరదళ్ళు అవుతారు.

నితిన్ అ ఆ సినిమాలో కూడా హీరో పాత్రకి సమంత మరదలు అవుతుంది. ఇందులో అనుపమ ఇంకో హీరోయిన్ గా కూడా ఉంటుంది. అరవింద వీరరాఘవ సమేత సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ కాగా ఆమెకి చెల్లి పాత్రలో అంటే హీరోకి మరదలు వరుస అయ్యే పాత్రకి ఈషరెబ్బని(Eesha Rebba) తీసుకొచ్చారు. ఆ తర్వాత అలవైకుంఠపురంలో సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే ఉన్నా సినిమాలో అల్లు అర్జున్ అసలు వారసుడు కాబట్టి ఆ పాత్రకి నివేదా పేతురాజ్(Nivetha Pethuraj) ని మరదలు పాత్రలో పెట్టారు. ఇక ఇప్పుడు వచ్చిన గుంటూరు కారం సినిమాలో అసలు హీరోయిన్ శ్రీలీల ఉన్నా కొసరుగా మరదలు పాత్ర పెట్టి మీనాక్షి చౌదరిని(Meenakshi Chaudhary) తీసుకొచ్చారు.

Trivikram Creates Sister in Law Character and Emotion Regularly in his Movies Athadu to Guntur Kaaram Repeats so Many Times

దీంతో త్రివిక్రమ్ సినిమాల్లో అన్ని ఫ్యామిలీ రిలేషన్స్ తో పాటు మరదలు రిలేషన్ కూడా రెగ్యులర్ గా వస్తుండటం, ఆ పాత్రకి ఇంకో హీరోయిన్ ని తీసుకోవడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ డీటైలింగ్ తెలుసుకున్న ప్రేక్షకులు అవును, నిజమే కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి త్రివిక్రమ్ నుంచి రాబోయే సినిమాల్లో కూడా మరదలు పాత్రలు ఇలాగే కంటిన్యూ చేస్తారా చూడాలి.