Samantha : సమంతకు పూలంటే పడవా? వాటివల్లే హాస్పిటల్ కి వెళ్లాల్సి వచ్చిందని..
తాజాగా ఫ్లవర్ బొకేతో ఓ ఫోటో షేర్ చేసిన సమంత ఆసక్తికర విషయాన్ని తెలిపింది.

Samantha post A photo with Flower Bouquet and Shares an interesting Thing
Samantha : సమంత ప్రస్తుతం కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమాలకు దూరంగా ఉండి తన ఆరోగ్యంపై ఫోకస్ చేసింది. ఇటీవల పలు దేశాలు తిరిగి తన మానసిక, శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటూ తన బిజినెస్ లు, ఫౌండేషన్స్ చూసుకుంటుంది సమంత. ఇటీవలే ఓ సినీ నిర్మాణ సంస్థ కూడా స్థాపించినట్లు ప్రకటించింది. త్వరలోనే ఆ సంస్థ నుంచి సినిమాలు రానున్నాయి.
ఇక సమంత రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందని తెలిసిందే. రెగ్యులర్ గా జిమ్ వీడియోలు, తన పెంపుడు కుక్కల ఫొటోలు, అప్పుడప్పుడు తన ఫొటోలు షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఫ్లవర్ బొకేతో ఓ ఫోటో షేర్ చేసిన సమంత ఆసక్తికర విషయాన్ని తెలిపింది.
ఎవరో ఫ్లవర్ బొకే ఇస్తే దాంతో సమంత ఫోటో దిగి ఆ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసి.. ఇలాంటివి చూసినప్పుడు మిక్స్‌డ్ ఫీలింగ్స్ కలుగుతాయి. ఎందుకంటే లాస్ట్ టైం వీటివల్లే నేను ఎమర్జెన్సీ రూమ్ కి వెళ్లాల్సి వచ్చింది. ఎవరికి పూలంటే ఎలర్జీ ఉంది అని పోస్ట్ చేసింది. దీంతో సమంత పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ తో సమంతకి పూలంటే ఎలర్జీ అని, గతంలో పూల వల్లే సామ్ హాస్పిటల్ లో చేరాల్సి వచ్చిందని తెలుస్తుంది.
Also Read : Yatra 2 : ఆర్జీవీ ‘వ్యూహం’ సినిమాలాగే.. ‘యాత్ర 2’ సినిమాలో పవన్, షర్మిల, లోకేష్ పాత్రలు ఉంటాయా?
ఇక సమంత త్వరగా సినిమాల్లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే సామ్ మాత్రం ఇంకా ఏ సినిమాలు ఓకే చేయలేదని సమాచారం. గతంలో పుష్ప సినిమాలో సమంత ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. పుష్ప 2లో కూడా సమంత ఐటెం సాంగ్ ఉండొచ్చని పలు వార్తలు వస్తున్నాయి. మరి అది నిజమో కాదో తెలియాలంటే ఎదురు చూడాల్సిందే.