డిసెంబర్ 20 నుండి ‘ప్రతిరోజూ పండగే’

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘ప్రతిరోజూ పండగే’ డిసెంబర్ 20న రిలీజ్ కానుంది..

  • Publish Date - October 16, 2019 / 11:41 AM IST

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘ప్రతిరోజూ పండగే’ డిసెంబర్ 20న రిలీజ్ కానుంది..

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థ.. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నాయి.

సాయి ధరమ్ తేజ్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ‘ప్రతిరోజూ పండగే’ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్‌గా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ‘ప్రతిరోజూ పండగే’ డిసెంబర్ 20న రిలీజ్ కానుంది.

Read Also : నారాయణమూర్తి బయోపిక్ ‘మూర్తి’

‘సెలబ్రేట్ లైఫ్ ఫ్రమ్ డిసెంబర్ 20th’ అంటూ న్యూ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్.. సంగీతం : థమన్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, కో-ప్రొడ్యూసర్ : ఎస్‌కెఎన్, నిర్మాత : బన్నీ వాసు.