‘చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది’.. PSPK 27 ప్రీ లుక్..

  • Published By: sekhar ,Published On : September 2, 2020 / 03:32 PM IST
‘చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది’.. PSPK 27 ప్రీ లుక్..

Updated On : September 2, 2020 / 7:15 PM IST

Pre-look poster of #PSPK27: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ ‌క‌ళ్యాణ్ 27వ సినిమా అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ కొద్దిరోజుల క్రితం ప్రారంభ‌మైంది. క‌రోనా రావ‌డంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. ప‌వ‌న్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎ.ఎం.ర‌త్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



ఉంగ‌రాలు, చేతికి క‌డియం, గ‌రుత్మంతుడు బొమ్మతో డిజైన్ చేసిన ప్రీ లుక్ పీరియాడిక్ చిత్రాన్ని తలపిస్తోంది. ‘‘పవన్‌ క‌ళ్యాణ్ గారు మీ 27వ చిత్రం పదిహేను రోజుల షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుంది. చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది. ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం, మీ సహృదయం..ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు అందుకుంటుండాలని ఆశిస్తూ.. హ్యాపీ బ‌ర్త్‌డే ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌’’ అని క్రిష్ ట్వీట్ చేశారు. ఎం.ఎం.కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం.. జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ, సాయిమాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.