Predator Badlands
Predator Badlands : హాలీవుడ్ సినిమాలు ఇటీవల ఇక్కడ భారతీయ భాషల్లో కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రెడేటర్ బ్యాడ్‌లాండ్స్ సినిమా నవంబర్ 7, 2025న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం భాషల్లో ఇండియాలో కూడా రిలీజ్ కానుంది. బ్యాడ్‌లాండ్స్ కేవలం రక్తపాతం, వేట మాత్రమే కాకుండా యాక్షన్, సై-ఫై, మానవ సంబంధాలతో కూడి ఉండబోతుంది. ట్రాచెన్‌బర్గ్ ఈసారి ప్రెడేటర్ యూనివర్స్‌ను మరింత విస్తరించారు. కేవలం సర్వైవల్ గేమ్‌కు పరిమితం కాకుండా, ప్రెడేటర్ హంట్ వెనుక ఉన్న లెజెండ్, యాట్జుజా కల్చర్, వారి కోడ్ ఆఫ్ హానర్ లాంటి అంశాలన్ని చూపించబోతున్నారు.(Predator Badlands)
ప్రెడేటర్ బ్యాడ్‌లాండ్స్ సినిమాకు ప్రమోషన్స్ ఇండియాలో భారీగా చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో నిర్వహిస్తున్న కామిక్ కాన్ లో ప్రెడేటర్ బ్యాడ్‌లాండ్స్ కూడా పాల్గొంది. ఈ సినిమా ఫ్యాన్స్, హాలీవుడ్ ఫ్యాన్స్ ప్రెడేటర్ బ్యాడ్‌లాండ్స్ వేదిక వద్ద సందడి చేసారు. యుద్ధ సన్నివేశాల్లో తాము కూడా పాల్గొన్నట్టు ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇక్కడ ప్రెడేటర్ బ్యాడ్‌లాండ్స్ స్టాల్ వద్ద పలు టాస్కులు ఇచ్చి విజిటర్స్ ని ఆడించారు కూడా.
Also Read : Kajal Aggarwal : భర్తతో కాజల్ అగర్వాల్ వెకేషన్.. ఆస్ట్రేలియాలో ఫుల్ ఎంజాయ్.. ఫొటోలు..
మొత్తనికి హైదరాబాద్ కామిక్ కాన్ లో ప్రెడేటర్ బ్యాడ్‌లాండ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హాలీవుడ్ సినిమాకు ఇక్కడి కామిక్ కాన్ లో మంచి రెస్పాన్స్ రావడం గమనార్హం. Elle Fanning, Dimitrios Schuster-Kolo Matangi ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా 20th సెంచరీ స్టూడియోస్ ద్వారా నవంబర్ 7, 2025న రిలీజ్ కానుంది.