×
Ad

Predator Badlands : మరో హాలీవుడ్ సినిమా తెలుగులో.. ప్రెడేటర్: బ్యాడ్‌లాండ్స్.. ఈసారి కేవలం హంట్ మాత్రమే కాదు..

తాజాగా మరో హాలీవుడ్ సినిమా రిలీజ్ కి రెడీ అయింది.(Predator Badlands)

Predator Badlands

Predator Badlands : ఇటీవల అనేక హాలీవుడ్ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇండియాలో హాలీవుడ్ సినిమాల మార్కెట్ మరింత పెరగడంతో హాలీవుడ్ సినిమాలు ఇక్కడ మార్కెట్ మీద దృష్టిపెట్టాయి. ఇప్పటికే ప్రతివారం ఏదో ఒక హాలీవుడ్ సినిమా ఇక్కడ భాషల్లో రిలీజ్ అవుతుండటంతో తాజాగా మరో సినిమా రిలీజ్ కి రెడీ అయింది.(Predator Badlands)

డాన్ ట్రాచెన్‌బర్గ్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రెడేటర్: బ్యాడ్‌లాండ్స్ కి ఇప్పటికే అమెరికాలో పడిన ప్రివ్యూ షోలతో మంచి రెస్పాన్స్ వస్తుంది. బ్యాడ్‌లాండ్స్ కేవలం రక్తపాతం, వేట మాత్రమే కాకుండా యాక్షన్‌, సై-ఫై, మానవ సంబంధాలతో కూడి ఉండబోతుంది. ట్రాచెన్‌బర్గ్ ఈసారి ప్రెడేటర్ యూనివర్స్‌ను మరింత విస్తరించారు. కేవలం సర్వైవల్ గేమ్‌కు పరిమితం కాకుండా, ప్రెడేటర్ హంట్ వెనుక ఉన్న లెజెండ్‌, యాట్జుజా కల్చర్‌, వారి కోడ్‌ ఆఫ్ హానర్‌ లాంటి అంశాలన్ని చూపించబోతున్నారు.

Also Read : Rajamouli : బాహుబలి డిజాస్టర్ టాక్.. పార్ట్ 2 చూసి నిద్ర రావడంతో అది కూడా ఫ్లాప్ అనుకున్న రాజమౌళి..

గతంలోనే ప్రెడేటర్ బ్యాడ్‌లాండ్స్ తెలుగు ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు. ఈ సినిమా నవంబర్ 7, 2025న ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు, తమిళం భాషల్లో ఇండియాలో రిలీజ్ కానుంది.