Preity Zinta : ప్రీతి జింటాకి చేదు అనుభవం.. రియాక్ట్ అయిన ప్రియాంక చోప్రా , హృతిక్ రోషన్!
ప్రీతి జింటా (Preity Zinta) కూతురితో ఒక మహిళ ఇబ్బంది కలగజేసేలా ప్రవర్తించింది. దీని పై హృతిక్ రోషన్ (Hrithik Roshan), ప్రియాంక చోప్రా (Priyanka Chopra) రియాక్ట్ అయ్యారు.

Preity Zinta facing trouble from fans and Priyanka Chopra Hrithik Roshan respond
Preity Zinta : సెలబ్రేటిస్ స్టేటస్ వచ్చాక ఫేమ్ తో పాటు అనేక ఇబ్బందులు ఎదురుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రైవసీ దొరక్క సెలబ్రేటిస్ అంతా అసౌకర్యంగా బ్రతుకుతుంటారు. ఎక్కడన్నా పబ్లిక్ ప్లేస్ ల్లో ఈ సెలబ్రేటిస్ కనిపిస్తే వారితో ఫోటో దిగడానికి అత్యుత్సాహం ప్రదర్శించి స్టార్స్ ని ఇబ్బందికి గురి చేస్తారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింటాకి ఒక చేదు అనుభవం ఎదురైంది. తన పిల్లలతో కలిసి ఈ శనివారం (ఏప్రిల్ 8) ముంబైలోని ఒక హోటల్ కి వెళ్ళింది.
Raviteja : బాలీవుడ్లో రవితేజ మల్టీస్టారర్.. నిజమేనా?
ఆ హోటల్ నుంచి బయటకి వస్తున్న సమయంలో ఒక మహిళ ప్రీతి జింటాతో ఫోటో దిగేందుకు ప్రయత్నించింది. అక్కడితో ఆగకుండా ఆ మహిళా ప్రీతి కూతురు ‘గియా’ని అనుమతి లేకుండా ముద్దు పెట్టేసుకుంది. ఇక కారు ఎక్కుతున్న సమయంలో ఒక వికలాంగుడు డబ్బులు అడుగుతూ కారుకి అడ్డుపడే ప్రయత్నం చేశాడు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక దీని పై ప్రీతి జింటా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది.
Ram Charan – Upasana : మాల్దీవ్ వెకేషన్కు వెళ్లిన రామ్చరణ్ అండ్ ఉపాసన..
పిల్లలు మాతో పాటు మా రంగంలోని వారు కాదు, సెలబ్రేటిస్ కాదు. వాళ్ళు పిల్లలు, వారిని స్వేచ్ఛగా బ్రతకనివ్వండి. వారిని తాకడం, పట్టుకోవడం, ఫోటోలు తీసుకోవడం లాంటివి చేసి ఇబ్బందులకు గురి చేయకండి అంటూ పోస్ట్ చేసింది. కాగా దీని పై హృతిక్ రోషన్ (Hrithik Roshan), ప్రియాంక చోప్రా (Priyanka Chopra), అర్జున్ రాంపాల్ మరియు మలైకా అరోరా తదితరులు స్పందిస్తూ ఆమెకు మద్దతు తెలిపారు.
View this post on Instagram