×
Ad

Prema Kadali : ‘ప్రేమ కడలి’ ట్రైలర్ రిలీజ్.. సినిమా ఎప్పుడంటే..

ఈ సినిమా ట్రైలర్ చూసేయండి.. (Prema Kadali)

Prema Kadali

Prema Kadali : నాని పిల్లిబోయిన, యామిని నాగేశ్వర్ జంటగా RN ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాధా మజ్జరి నిర్మాణంలో నాని పిలిబోయిన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ప్రేమ కడలి. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసి ఈవెంట్ నిర్వహించారు.(Prema Kadali)

విలేజ్ లో ఉండే ఓ అబ్బాయి సినిమా తీయాలని ప్రయత్నించడం, ఈ క్రమంలో అతని జీవితంలోకి ప్రేమ రావడం అనే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. ఈ సినిమా ట్రైలర్ చూసేయండి..

Also Read : Ee Nagaraniki Emaindhi : అప్పుడు గోవా.. ఇప్పుడు థాయిలాండ్.. ఇరవై రెట్లు ఎక్కువ బడ్జెట్ పెట్టి సీక్వెల్ సినిమా..

ఈవెంట్లో సినిమా హీరో, డైరెక్టర్ నాని పిల్లిబోయన మాట్లాడుతూ.. గల్ఫ్ లో ఉంటూ సినిమా తీయాలి అనే ప్యాషన్ తో 2 ఏళ్ళు కష్టపడి తీశాను. ఈ సినిమా కోసం నా భార్య రాధ మజ్జారి ఎంతో సపోర్ట్ చేసింది. ఈ సినిమా జనవరి 30న రిలీజ్ కానుంది అని తెలిపారు.

నటుడు, నిర్మాత తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమా చూసాను నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమాకి ఎంతగానో కష్టపడుతున్నారు, ఈ సినిమా కచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది. ఈ సినిమా రిలీజ్ లో సహాయం చేస్తాను అని తెలిపారు.

Also Read : Divi : నాభి అందాలు చూపిస్తూ దివి.. సింపుల్ లుక్స్ లో ఫొటోలు వైరల్..